రాష్ట్రీయం

ఏం చేద్దాం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: ఖమ్మం జిల్లా పాలేరులో జరగనున్న ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం తన నివాసగృహంలో తెలంగాణ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ భేటీలో ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ, సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన నామా నాగేశ్వరరావు తదితరులున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మరణంతో ఏర్పడిన ఖాళీ భర్తీకి ఈ ఉప ఎన్నిక జరుగుతున్నందున పోటీ ఆలోచన విరమించుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేతలు తమను కోరుతున్నట్లు తెలంగాణ నేతలు తెలిపారు. అసలు పార్టీ పోటీ చేయాలా? వద్దా?, పోటీ చేయాల్సి వస్తే ఎవరిని బరిలోకి దించాలి, ఒక వేళ నామా నాగేశ్వరరావును పోటీకి నిలిపితే తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరాదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.