రాష్ట్రీయం

సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తనను రెండు సార్లు రాజ్యసభకు పంపించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. హనుమంతరావు శనివారం తన కుటుంబ సభ్యులతో వెళ్లి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. హనుమంతరావు రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం జూన్‌తో ముగుస్తోంది. సోమవారం నుండి పునఃప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఆయనకు ఆఖరు సమావేశాలవుతాయి. అందుకే ఆయన ఈరోజు సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తాను గాంధీ కుటుంబానికి ఎప్పటికీ విధేయుడిగా ఉంటానని, ఇక మీదట పార్టీ తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా పని చేస్తానని హనుమంతరావు తరువాత విలేఖరులతో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.