రాష్ట్రీయం

సింహాద్రినాథుని సాక్షిగా తరలిపోయిన గోవులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 23: సింహాద్రినాథుని సాక్షిగా శుక్రవారం రాత్రి సింహగిరిపై నుంచి నాలుగు వ్యాన్లలో గోవులు తరలిపోయాయి. భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన గోవులను కొంతమంది వ్యక్తులు వ్యాన్లలో తరలించుకుపోవడం విలేఖరుల కంటపడింది. వారిని ఆపి ప్రశ్నించగా దేవస్థానం వారే కిందికి తీసుకురమ్మన్నారంటూ సమాధానం చెప్పి హుటాహుటిన అక్కడ నుంచి ఉడాయించారు. ఈ విషయమై దేవస్థానం వర్గాలను సంప్రదించగా అవి సంకరజాతివి అయి ఉంటే తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వ్యాన్లలో ఆవులను తరలించుకుపోయిన వ్యక్తులు దేవస్థానం సిబ్బందికి తెలిసిన వారు కావడం పలు అనుమానాలకు తావిస్తొంది. వారిలో జంతు సంరక్షణ సమితికి సంబంధించిన వారు కూడా ఉన్నారని, ఇవన్నీ రైతులకు అప్పగించడానికి తీసుకువెళ్తున్నారన్న వాదనను దేవస్థానంలో ఒక వర్గం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి మొక్కుబడుల రూపంలో ఏటా వందల సంఖ్యలో వస్తున్న గోవులు ఏమైపోతున్నాయోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సంకర జాతి గోవులను మొక్కుబడుల రూపంలో సమర్పించవద్దంటూ దేవస్థానం బోర్డులు పెట్టి, ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకుంటోంది. దేశవాళీ గోవులను స్వీకరిస్తూ వాటిలో కొన్నింటిని సంరక్షిస్తూ ఓ జంతు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులకు అప్పగించే ప్రక్రియను మూడేళ్ల కిందట సింహాచలం దేవస్థానం ప్రారంభించింది. అనంతరం దాని గురించి పట్టించుకోవడం మానేసింది. దీంతో గత మూడేళ్లుగా గోవులు దళారుల చేతుల్లో చిక్కి కబేళాలకు తరలిపోతున్నాయి. ఇటీవల జర్మనీకి చెందిన ఓ పరిశోధకురాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోవుల దయనీయ పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ఏటా వందల సంఖ్యలో సింహాచలేశునికి భక్తులు సమర్పిస్తున్న గోవులు దారిమళ్లిపోతున్నాయన్న ఆవేదన, ఆందోళన భక్తుల్లో నెలకొంది.

chitram సింహాచలం నుంచి వ్యాన్లలో తరలిపోతున్న గోవులు