రాష్ట్రీయం

ఒకే రోజు 388 ఇంకుడు గుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 23:ఉరుముతున్న కరవుపై డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సమరశంఖం పూరించారు. గ్రామస్థులను ఒకతాటిపైకి తెచ్చి, ఒకేరోజు 388 ఇంకుడు గుంతల్ని తవ్వించి, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు డిప్యూటీ స్పీకర్‌ను ఆలోచనలో పడేశాయి. ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని ఆ దిశగా కార్యోన్ముఖుల్ని చేసేందుకు తన స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్‌ను ఎంచుకున్నారు. అయితే ఇప్పటికే నిర్మించిన ఇంకుడు గుంతలకు బిల్లులు రాకపోవడంతో మరిన్ని నిర్మించేందుకు గ్రామస్థులు వెనుకంజ వేశారు. దాంతో ఆమె గ్రామ రచ్చబండ వద్ద సమావేశం ఏర్పాటు చేసి వారిలోని అభద్రతా భావాన్ని తొలగించి చైతన్యం కల్పించారు. కలెక్టర్‌తో చర్చించి ఇంకుడు గుంతల నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చారు. గ్రామంలో మొత్తం 472 ఇళ్లు ఉండగా 84 ఇళ్లు గుట్టపై ఉన్న బండరాయిపై ఉన్నాయి. మిగిలిన 388 ఇళ్లకు ఒకే రోజు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. మే 2వ తేదీన రామాయంపేట మండలంలోని ఝాన్సిలింగాపూర్, 5న దొంగల ధర్మారంలో వంద శాతం ఇంకుడు గుంతలను నిర్మింపజేసే కార్యక్రమానికి ఆమె రూపకల్పన చేసుకున్నారు. గ్రామంలోని ఇళ్లను క్లస్టర్లుగా మార్చి అందుకు ఒక అధికారిని నియమించి ఇంకుడు గుంతలను నిర్మింపజేయడంలో ఆమె సఫలీకృతులయ్యారు.

చిత్రం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఐకెపి కార్యాలయం ఆవరణలో
ఇంకుడు గుంత నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జిల్లా సమాఖ్య సభ్యులు