ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 24: ప్రపంచ ఖ్యాతి గడించిన అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయిబాబా 5వ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ఆయన చూపిన మార్గాన్ని సందేశాత్మక అవతార విశిష్టతను మననం చేసుకుంటూ అవతార ఆరాధనోత్సవ వేడుకలను భక్తజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇక హిల్‌వ్యూ స్టేడియంలో వేలాదిమంది అన్నార్థులు, పేదలు, సాయిభక్తులకు నారాయణసేవ, అన్న, వస్త్ర ప్రసాద వితరణ గావించారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే గీతారెడ్డి, సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, కార్యదర్శి ప్రసాదరావు, సభ్యులు చక్రవర్తి, నాగానంద, మిశ్ర, పాల్గొని దివ్యానుభూతి పొందారు. అనంతరం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి విద్యాజ్యోతి కార్యక్రమాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా క్రమశిక్షణతో కూడిన విద్యా విధానంలో మరో మైలురాయి విద్యాజ్యోతి ద్వారా అధిగమించనున్నారన్నారు. సత్యసాయి బాబా తమ అవతారాన్ని భౌతికంగా చాలించినా ఆయన చూపిన మార్గంలో భక్తకోటి చేస్తున్న సేవ, సన్మార్గం రూపంలో సత్యసాయి కొలువై వున్నారని ఆరాధనోత్సవాల్లో వక్తలు పేర్కొన్నారు. సాయిమార్గమే నేటి ప్రపంచానికి పరమావధి అని వక్తలు అభివర్ణించారు. ఈ సందర్భంగా సాయిభక్తులు, విద్యార్థులు సంగీత కచేరీ, భక్తిగేయాలాపన కార్యక్రమాలు నిర్వహించారు.
సత్యసాయి సేవలు అమోఘం : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
‘మానవసేవే మాధవ సేవ’ అని ప్రపంచాన్ని సేవామార్గంలో నడిపి ఆచరించి చూపిన భగవాన్ సత్యసాయి సేవలు అమోఘమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. సత్యసాయి 5వ ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం ఆయన పుట్టపర్తికి వచ్చారు. ఉదయం హిల్‌వ్యూ స్టేడియంలో వేలాది మంది భక్త జనసందోహం మధ్య సత్యసాయికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి అన్నప్రసాద, వస్తద్రానం, నారాయణసేవను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

సత్యసాయిబాబా ఆరాధనోత్సవాల్లో భాగంగా మహాసమాధిని సుందరంగా అలంకరించిన దృశ్యం

సత్యసాయి మహా సమాధికి మొక్కుతున్న వెంకయ్యనాయుడు