ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా రాములోరి పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 24: మరో అయోధ్యగా పేరుగాంచి, ఏకశిలా నగరంగా పిలువబడే ఒంటిమిట్ట కోదండ రామస్వామికి ఆదివారం నిర్వహించిన పుష్పయాగం కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీసీతారాముల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఆలయ ఆగ్నేయ భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీసీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు టిటిడి డిప్యూటీ ఇఓ బాలాజీ ఆధ్వర్యంలో పుష్పయాగాన్ని ప్రారంభించగా సుమారు 7 గంటల పాటు సాగింది. అలాగే వేదమంత్రోచ్ఛారణల మధ్య విష్వసేన పూజ, మహా సంకల్పం, శాంతిహోమం, నవగ్రహ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పుష్పయాగంలో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన వివిధ రకాల పుష్పాలను వినియోగించారు. ఈ యాగాన్ని తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తజనం వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ రంగ మంటపాన్ని వివిధ పుష్పాలతో అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన చిన్నారి వెంకట్ ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ నెల 14న ప్రారంభమైన రాములోరి బ్రహ్మోత్సవాలు 11వ రోజు పుష్పయాగంతో ఘనంగా ముగిశాయనే చెప్పవచ్చు.

కడప జిల్లా ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పుష్పయాగంలో దర్శనమిస్తున్న శ్రీసీతారాములు

ఖమ్మం గులాబీమయం!

ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఏప్రిల్ 24: టిఆర్‌ఎస్ పార్టీ 15వ ప్లీనరీ ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో ఖమ్మం నగరాన్ని గులాబీమయం చేశారు. ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి 4వేల మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో వారందరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్థానిక చెరుకూరి మామిడితోట సమీపంలో ప్రత్యేకంగా ప్రతినిధుల సభకోసం ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో సభాప్రాంగణమంతా చల్లగా ఉండేలా కూలర్లు, ఎసిలు అమర్చారు. ఈ సభలోనే 42లక్షల మంది పార్టీ సభ్యుల భవితవ్యం, రాష్ట్ర అభివృద్ధికి పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ, పార్టీ మధ్య సయోధ్య, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు అయిన కెసిఆర్ ఈ సభలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 15 సంవత్సరాలుగా టిఆర్‌ఎస్ చేపట్టిన కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు.
ఇదిలా ఉండగా ప్లీనరీ వేదికగా ఖమ్మం జిల్లాకు కూడా ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి భారీగా నేతలను చేర్చుకుంటున్న టిఆర్‌ఎస్ అధిష్టానం వారందరినికి ఈ వేదికపైనే పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. గడిచిన సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే స్థానంలో విజయం సాధించిన టిఆర్‌ఎస్‌లోకి ఆ తర్వాత వైరా, ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, వందల సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు చేరారు. ఇదే క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కూడా తన అనుచరులతో కలిసి ప్లీనరీ రోజే టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్లీనరీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా అంతకుముందే పిజి కాలేజ్ మైదానంలో టిఆర్‌ఎస్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రతినిధుల సభ అనంతరం ప్రభుత్వ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 5లక్షల మందికి పైగా ప్రజలు రానున్నట్లు నేతలు చెప్తున్నారు. ప్లీనరీ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని ప్రధాన వీధులన్నింటిని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా టిఆర్‌ఎస్ జెండాలు, బ్యానర్లతో నింపివేశారు. జిల్లా వ్యాప్తంగా ప్లీనరీకి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.