రాష్ట్రీయం

ఇది చిల్లర మల్లర రాజకీయం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: వివిధ పార్టీలకు చెందిన నేతలు టిఆర్‌ఎస్‌లోకి రావడం చిల్లర మల్లర రాజకీయాలు కావని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ చేరికలు తెలంగాణ రాజకీయ పునరేకీకరణలో భాగమని, ఇవి తెలంగాణకు చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ (మెదక్) సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని పాలించలేరని అప్పటి సమైక్యవాదులు ఎద్దేవా చేశారని, గెలిచి నిలిచిన తెలంగాణ నిలిచి గెలుస్తుందన్నారు. దీనికి కోసం ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ శక్తులన్నింటినీ ఏకం చేయడానికి తాము ప్రయత్నం చేస్తుంటే, కొందరు రాజకీయమే పరమావధిగా ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుగా తయారయ్యారని ముఖ్యమంత్రి అన్నారు. ఏదన్నా పని మొదలు పెట్టకముందే విమర్శలు చేయడం మంచిది కాదని, అలాంటి వారిని పట్టించుకోవద్దని ప్రజలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా మేము ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ శాసనసభ సాక్షిగా కలసిపోయే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్ తరాలకు నష్టం కలుగుకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అచితూచి కూలంకశంగా చర్చిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఆరు దశాబ్దాల పోరాటాల అనంతరం సాధించుకున్న రాష్ట్రానికి దిశ, దశ నిర్దేశించుకునే కీలక సందర్భంలో తెలంగాణ ఉందన్నారు.
‘జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం, అందులో మన బెస్ట్ కంట్రిబ్యూషన్ ఏమిటన్నదే ముఖ్యం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఎన్నాళ్లు బతికామన్నది గాదు, ఎంత క్వాలిటీగా బతికామన్నదే ముఖ్యం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఖమ్మం చుట్టుపక్కల గ్రామాలకు పాలేరు నుంచి మంచినీటిని అందిస్తామన్నారు. గోదావరిని ఖమ్మం జిల్లాకు మళ్లించి ఒక్క ఇంచు భూమినీ వదలకుండా సాగులోకి తీసుకు రాబోతున్నామని అన్నారు. విద్యావంతుడైన పువ్వాడ తనకు కొడుకు లాంటి వాడని ముఖ్యమంత్రి కొనియాడారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మలకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరినీ కలుపుకు పోతూ పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. తన స్వస్థలానికి చెందిన ఫారూఖ్ హెస్సేన్ చిరపరిచితుడని, కలిసి పనిచేద్దామని తానే పార్టీలో చేరాల్సిందిగా కోరానని ముఖ్యమంత్రి చెప్పారు.

చిత్రం సోమవారం సిఎం క్యాంపు కార్యాలయంలో కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్