రాష్ట్రీయం

‘బీర్’బలులకు నిరాశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: అసలే ఎండాకాలం. ఆపై వడగాడ్పులు. కనీసం గ్లాసెడు మంచినీరు ఇవ్వకపోయినా, కొనుక్కుందామనుకుంటే ఒక సీసా బీరుకు కూడా ఆంధ్రలో కటకట ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆర్టోస్ బ్రూవరీ సంస్ధ గోల్డెన్ ఈగల్ బ్రాండ్ బీరును ఉత్పత్తి చేసేది. అయితే ఈ సంస్ధకు లైసెన్సు పునరుద్ధరణ కాలేదు. శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలోని బీర్ల ఫ్యాక్టరీ నుంచి సాలీనా 60 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి అవుతుంది. మార్కెట్ డిమాండ్‌కు ఇది ఏ మూలకూ చాలడం లేదు. తెలంగాణనుంచి బీరు సరఫరా అయ్యేది. కాని స్ధానిక మార్కెట్‌లో డిమాండ్ తట్టుకోవడం కష్టంగా ఉందని, ఏపికి సరఫరా చేయలేమని తెలంగాణ బ్రూవరీస్ కార్పోరేషన్ చేతులెత్తేసింది. ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయల సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఏపిలో ఐదువేల వరకు ఉన్న వైన్‌షాపులకు బీర్ సరఫరాపై రేషన్ విధించారన్నారు. ఒక షాపుకు రోజుకు ఐదు కేసులు ఇస్తున్నారు. ఒక కేసులో 12 బీర్లు ఉంటాయి. వాస్తవానికి ఈ సీజన్‌లో ఒక్కో షాపు రోజుకు కనీసం పది కేసుల బీర్లను అమ్ముతుంది. గత మార్చి నుంచి ఏపిలో 20 లక్షల కేసుల బీరు అమ్ముడైంది. మే నెలలోగా మరో 15 లక్షల కేసుల బీరు అమ్మే అవకాశం ఉందని వైన్ డీలర్లు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బీర్ల విక్రయం 200 శాతం పెరిగింది. బీరు ప్రియుల ఆత్రుతను చూసి 650 ఎంఎల్ బీరును రూ.105కు విక్రయించాల్సి ఉండగా, రూ. 20 పెంచి అమ్ముతున్నారు.
బీర్ డిమాండ్‌ను చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా గోవా, ఔరంగాబాద్, పాండిచ్ఛేరిలోని బీర్ల ప్యాక్టరీలకు వెంటనే 10 లక్షల బీర్లు సరఫరా చేయాలని ఆర్డర్ ఇచ్చింది. ఏపిలో బీర్లకు ఉన్న డిమాండ్ చూసి కర్నాటక, తమిళనాడు నుంచి కొందరు స్మగ్లర్లు సరిహద్దు జిల్లాలకు పెద్దయెత్తున బీరు అక్రమంగా రవాణా చేస్తున్నారు.