రాష్ట్రీయం

ఇక ఇక్కణ్నుంచే పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్లమంది ప్రజలకు ఈ రాష్ట్ర కుటుంబ పెద్దగా అవసరమైతే కఠోర నిర్ణయాలు తీసుకుంటూ సమర్థవంతమైన, నీతిమంతమైన పాలనను అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రామరాజ్యాన్ని మరిపిస్తానని చెప్పకపోయినా నేటికీ సీతారాముల కల్యాణాన్ని, రామరాజ్యాన్ని ఎందుకు గుర్తుచేసుకుంటున్నారో తనకు బాగా తెలుసంటూ.. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ ఆనందంగా గర్వపడుతూ తలెత్తుకు తిరిగేలా చూడాలన్నదే తన లక్ష్యంగా చెప్పారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనలో జొప్పించడమే తన విజయ రహస్యమని ఆయన అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి గ్రామంలో దాదాపు 50 ఎకరాల్లో తాత్కాలికంగా యుద్ధప్రాతిపదికన నిర్మాణమవుతున్న ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయం తొలిదశను సోమవారం తెల్లవారుజామున 4.01 నిముషాలకు శాస్త్రోక్తంగా చంద్రబాబు పూజాదికాలు నిర్వహించి ప్రారంభించారు. ఇక ఇక్కడి నుంచే తన పరిపాలన ప్రారంభమైనట్లు గుర్తుగా రెండోవిడత రుణమాఫీకి రూ.3,200 కోట్లు, డ్వాక్రా మహిళా సంఘాల పెట్టుబడి నిధికి రూ.2,400 కోట్లు కేటాయిస్తూ ఆయన సంతకాలు చేశారు. ఇదే సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం మెట్ట భూములిచ్చిన రైతులకు అదనంగా మరో 50 చదరపు గజాలు ఇవ్వనున్నామంటూ ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. మెట్ట, జరీబు భూముల రైతులనే కాకుండా ఈప్రాంత రైతుకూలీలు, పేదలను కూడా తప్పక ఆదుకుంటామని చెప్పారు.
రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా రైతు రుణమాఫీని నాలుగు విడతలుగా చేయనున్నప్పటికీ దీనివల్ల రైతులెవరూ నష్టపోకుండా 10శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఈవిధంగా దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుకు సహాయపడలేదన్నారు. ‘రాష్ట్రాన్ని నిట్టనిలువుగా విభజించాలని ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కోరుకోలేదు. ఒకవేళ తప్పనిసరి అయితే ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా ఆమోదయోగ్యమైన రీతిలో విభజించాలంటూ నేను నెత్తీనోరూ బాదుకున్నాను’ అని చెప్పారు. రాజధానిగానీ,, విద్యాసంస్థలు, కనీస వౌలిక సదుపాయాలుగానీ లేకుండా ఎక్కువ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆదాయం 49.35 శాతం, తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ఆదాయం 58.65 శాతం ఉండేలా విభజించారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో గడచిన రెండేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూనే తాను చేపట్టిన సంస్కరణ ఆధారంగా 11 శాతం వృద్ధిరేటును సాధించామని చెప్పారు.
నూతన రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన ఘనత ఈప్రాంత రైతులకు దక్కుతుందని చంద్రబాబు అన్నారు. తనపై అభిమానంతో సింగపూర్ ప్రభుత్వం నయాపైసా ఆశించకుండా కేవలం ఆరు మాసాల వ్యవధిలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చిన వెంటనే అమరావతి నిర్మాణానికి రూపకల్పన చేశామన్నారు.

చిత్రం తాత్కాలిక సచివాలయం తొలి దశ భవనాలను సోమవారం ఉదయం ప్రారంభించిన
అనంతరం వేద పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న చంద్రబాబు.
--

మెరుగైన సేవల కోసమే
పాలన వ్యవస్థలో వినూత్నమైన విధానాలను అవలంబించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించి తరలి రావాలి.
- ఠక్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

మూడు నెలల్లో రైతులకు ప్లాట్లు
తాత్కాలిక సచివాలయ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి పాలన వ్యవస్థను ఇక్కడికి తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు ఉద్యో గ సంఘాలు సహకరించాలి. మరో మూడు నెలల్లో రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తిచేసి రాజధానిలో నిర్మాణాలు చేపడతాం.
- శ్రీకాంత్, సిఆర్‌డిఎ కమిషనర్

ప్రభుత్వంతోనే ఉద్యోగులు
ఉద్యోగుల నిరంతర శ్రమతోనే తాత్కాలిక సచివాలయ పనులు త్వరితగతిన పూర్తయ్యాయి. ప్రభు త్వం చేసే ప్రతి పనిలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంటుంది. రాష్ట్భ్రావృద్ధికోసం ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
- అశోక్‌బాబు, ఏపి ఎన్‌జిఓ నేత