రాష్ట్రీయం

వైద్యానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాద్‌లో పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయిలో ఇండో-యూకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించనున్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు కావాల్సిన స్థలం సమకూర్చడంతో పాటు ఇతర వౌలిక సదుపాయాలు కల్పిస్తామని సంబంధిత ప్రతినిధులకు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. ఇండో-యూకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైర్మన్ ప్రొఫెసర్ మైక్ పార్కర్, గ్రూప్ సిఇఓ డాక్టర్ అజయ్ గుప్తా, భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మైక్ ఆలిస్టర్, హెల్త్‌కేర్ ఇంచార్జ్ యుకె హెల్త్ డిపార్ట్‌మెంట్ మైక్ నితవ్రియాంకిస్, భారత ప్రభుత్వ ఇనె్వస్ట్ ఇండియా గ్రూప్ మేనేజర్ ఉదయ్ మంజాల్ తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సిఎంని కలిశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పారు. పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నిర్మించే ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఇవ్వాలని కోరారు. దీనికి సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. నగర శివార్లలో ఔటర్ రింగు రోడ్డు సమీపంలో స్థలం ఇవ్వడానికి అంగీకరించారు. స్థలం ఎంపిక తర్వాత ఎంఓయు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి తివారీ, టిఎస్‌ఐఐసి ఎండి ఇవి నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇండో-యూకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధులతో సమావేశమైన సిఎం కెసిఆర్