రాష్ట్రీయం

రేపు రాకెట్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 26: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో స్వదేశీ నావిగేషన్ సేవలకు సంబంధించిన ఏడో ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వసిద్ధం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ నెల 28న మధ్యాహ్నం 12:50గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 9:20 గంటలకు ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరిగే పిఎస్‌ఎల్‌వి-సి 33 వాహక నౌక ద్వారా 1425కిలోల బరువుగల భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహాన్ని (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి) నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. మన దేశ అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో రూపొందించారు.
రాకెట్ విజయం కోసం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని వి ఎస్ ఎస్‌సి డైరెక్టర్ డాక్టర్ శివన్ ప్రత్యేక పూజలు చేశారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని నాలుగో దశలో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్ననికి పూర్తి చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు నైట్రోజన్ హీలియం గ్యాస్‌ను నింపే ప్రక్రియను కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. నాలుగు దశలు కలిగిన పిఎస్‌ఎల్‌వి రాకెట్ 44.4 మీటర్ల ఎత్తు 320 టన్నుల బరువు కలిగి ఉంటుంది. మొదటి దశలో 138టన్నుల ఘన ఇంధనం, రెండో దశలో 41.7టన్నుల ధ్రవ ఇంధనం, మూడో దశలో 7.6టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5టన్నుల ధ్రవ ఇంధనం ఉంటుంది. రాకెట్‌కు మొదటి దశలో వేగంగా నెట్టేందుకు 6స్ట్ఫ్రాన్ ఎక్స్‌ఎల్ మోటార్లను అమర్చారు. రాకెట్ భూమి నుండి ఎగిరిన తరువాత దశల వారిగా నాలుగు దశలను పూర్తిచేసుకున్న అనంతరం 20నిమిషాలకు ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ప్రయోగానికి 51:30గంటల ముందు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా పూర్తిచేసుకొన్నంతరం సరిగ్గా గురువారం మధ్యాహ్నం 12:50గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది. బుధవారం రెండో దశలో ధ్రవ ఇంధనం నింపినంతరం మళ్లీ రాకెట్‌లోని అన్ని భాగాల పనితీరును గమనించినంతరం విద్యుత్ సరఫరా ఇస్తారు. ప్రయోగానికి ఎనిమిది గంటల ముందు మిషన్ కంట్రోలర్ సెంటర్‌లో ఉన్న సూపర్ కంప్యూటర్లకు అనుసంధానం చేసి అక్కడ నుండి రాకెట్ పనితీరును గమనిస్తారు. ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ బుధవారం షార్‌కు చేరుకోనున్నారు. బెంగళూరు నుండి ఆయన నేరుగా శ్రీహరికోటకు చేరుకొని ప్రయోగ వేదిక వద్దకు చేరుకొని కౌంట్‌డౌన్ పనితీరును గమనించనున్నారు.

చిత్రం... ఉపగ్రహం చుట్టూ అమర్చిన ఉష్ణ కవచం