రాష్ట్రీయం

నేడు జెఇఇ మెయిన్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటిలతో పాటు పలు జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన ఆఫ్ లైన్‌లో, 9,10 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఐఐటి జెఇఇ మెయిన్ పరీక్ష ఫలితాలు 27వ తేదీన విడుదల కానున్నాయి. ఇందుకు సిబిఎస్‌ఇ అన్ని సన్నాహాలు చేస్తోంది. 27వ తేదీ వేకువజామునే ఫలితాలను విడుదల చేయాలని సిబిఎస్‌ఇ యోచిస్తోంది. ఈ స్కోర్ ఆధారంగానే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే వారిని ఎంపిక చేస్తారు. అత్యధిక మార్కులు సాధించిన రెండు లక్షల మందిని ఎంపిక చేసి వారిని జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఈ నెల 29వ తేదీ నుండి జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
దేశవ్యాప్తంగా జెఇఇ మెయిన్ ఆన్ లైన్ పరీక్ష 9వ తేదీన , ఆర్కిటెక్చర్ కోర్సులో అడ్మిషన్ కోరుకునే విద్యార్థులకు ఆదివారం 10వ తేదీన మరో జరిగింది. రెండు రాష్ట్రాల నుండి మొత్తం 20వేల మంది ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేశారు. ఈ నెల 3వ తేదీన రాత పరీక్ష జరగ్గా, కొందరు ఆన్‌లైన్ విధానం ద్వారా కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 20,748 మంది దరఖాస్తు చేశారు. అందులో ఎపి నుండి 14,760 మంది, తెలంగాణ నుండి 5988 మంది ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో, ఎపిలో విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, తిరుపతి పట్టణాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 18న పరీక్ష తొలి కీని విడుదల చేశారు. 27న జెఇఇ మెయిన్ మార్కులను విడుదల చేసి, తుది ర్యాంకులను జూన్ 30న విడుదల చేస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 13.3 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఆన్‌లైన్ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఆఫ్‌లైన్ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షన్నర మంది దరఖాస్తు చేశారు. ఐఐటి మెయిన్ నుండి అడ్వాన్స్‌డ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా కొత్తవాటితో కలిపి 21 ఐఐటిల్లో ప్రవేశం దక్కుతుంది. ఐఐటి జెఇఇ మెయిన్ ర్యాంకు ఆధారంగానే 31 ఎన్‌ఐటిలు, 18 జాతీయ ప్రాధాన్యత ఉన్న సంస్థల్లో సీట్లు ఇవ్వడంతో పాటు హర్యానా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లు ఇస్తారు. ఈసారి మెయిన్ కటాఫ్ మార్కులు 120 దాటవచ్చని అంచనా. 2013లో జనరల్ కేటగిరి అభ్యర్థి కటాఫ్ 113 కాగా, 2014లో కటాఫ్ 115 ఉంది. ఈ ఏడాది 120 దాటవచ్చని చెబుతున్నారు.

జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’కు రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని, ఇక జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎపి ఎన్నికల సంఘం ప్రకటించింది. జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపునిస్తూ పార్టీ అధ్యక్షుని హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు గుర్తింపు పత్రాలను పంపించింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఇతర రిటర్నింగ్ అధికారులకూ ఈ పత్రాలను పంపించింది. పార్టీ ఎన్నికల గుర్తిం పు విషయంలో స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యం ఇస్తామని కూడా తెలిపింది.