రాష్ట్రీయం

చల్లబడ్డ న‘గరం’ పలు చోట్ల వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ప్రఛండ భానుడి ప్రతాపంతో గత కొద్దిరోజులుగా నిప్పుల కొలిమిగా మారిన నగరం ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే ఎండ బాగా మండిపోతూ వడగాలుగా వీయటంతో రాత్రి పూట ఉక్కపోత రెట్టింపయిన సమయంలో ఊహించని విధంగా మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రత గరిష్ఠ స్థాయికి చేరుకునే సమయానికి ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని చల్లటి గాలులు వీశాయి. పనె్నండున్నర సమయంలో చార్మినార్, శాలిబండ, ఎం.జె.మార్కెట్ తదితర ప్రాంతాల్లో కాసేపు ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లలో వర్షపు నీరు నిలిచింది. ఎండ ప్రభావం తగ్గి చల్లటి గాలులు వీయటంతో పలు చోట్ల వాహనదారులు వర్షంలో తడుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరిగి రాత్రి ఎనిమిది గంటల సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో వేర్వేరు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో చార్మినార్ వద్ద రోడ్లపై నిలిచిన నీరు

కెటిఆర్, హరీశ్ ఇద్దరూ ఇద్దరే
మంత్రివర్గంలో అందరూ కీలకమే ఎంపి కవిత

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26:మంత్రివర్గంలో అంతా ముఖ్యమైనవారేనని, పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేసినట్టు టిఆర్‌ఎస్ ఎంపి కవిత తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాలనా సౌలభ్యం కోసం శాఖల్లో మార్పులు చేస్తే దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంత్రివర్గంలో కెటిఆర్, హరీశ్‌రావు ఇద్దరూ సమానమేనని ఇద్దరూ ఇద్దరేనని అన్నారు. ఒకరి ప్రాధాన్యత తగ్గించడం, ఒకరిది పెంచడం అనే ప్రశే్న ఉత్పన్నం కాదని చెప్పారు. బంగారు తెలంగాణ సాధన కోసం మంత్రులు, పార్టీ నాయకులు ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారని అన్నారు.

ఉప కార్యదర్శి పోస్టుపై లొల్లి
తమదేనంటున్న బోర్డు సిబ్బంది
తమకు ఇవ్వాలంటున్న లెక్చరర్ల సంఘం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా సంచాలకుడి కార్యాలయంలోని ఉప కార్యదర్శి పదవి అనేక వివాదాలకు నాంది పలికింది. జూనియర్ లెక్చరర్లు ఈ పోస్టును తమకే కేటాయించాలని కోరుతుండగా, కార్యాలయంలోని ఉప కార్యదర్శి పదవి తమకే దక్కాలని సంచాలకుడి కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటర్మీడియట్ డైరెక్టర్ కార్యాలయంలో కమల్‌నాధన్ కమిటీ నోటిఫికేషన్ ప్రకారం ఒక ఉప కార్యదర్శి పోస్టును కేటాయించారు. గతంలో అన్ని విధాలా అర్హులైన అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఉప కార్యదర్శి పదవిని పదోన్నతిపై కేటాయించేవారు, అయితే రిటైర్మెంట్ కారణంగా అక్టోబర్ 2015 నుండి ఉప కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దాంతో జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న వారిని ఉపకార్యదర్శిగా నియమించాలని అధ్యాపకుల సంఘం కోరింది. వరంగల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వారు ఉండగా పదోన్నతి కల్పించకుండా తాజాగా ప్రభుత్వానికి విషయనివృత్తి పేరుతో జాప్యం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని టిఎన్జీవో ప్రధానకార్యదర్శి ఎన్ జె ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.