ఆంధ్రప్రదేశ్‌

ఎంసెట్ రాసే విద్యార్థులకు బస్సుల్లో ప్రయాణం ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 26: రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఒంగోలులోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈనెల 29న లక్షలాదిమంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షలకు హాజరౌతున్నారన్నారు. రాష్ట్రంలో ఒకప్రాంతం నుండి మరో ప్రాంతానికి పేద విద్యార్థులకు రవాణాసౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు 13 జిల్లాల్లో ఎంసెట్‌పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టిక్కెట్లు చూపించి ఆర్‌టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఆర్‌టిసి అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు.

మహిళపై విషపు
ఇంజక్షన్‌తో దాడి

అక్రమ సంబంధమే కారణం

చీరాల, ఏప్రిల్ 26: మహిళపై పాయిజన్ ఇంజక్షన్‌తో దాడి చేసి గాయపరచడంతో ఆమె మృతి చెందిన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఎల్‌బిఎస్ నగర్‌కు చెందిన పౌల్ట్రీ యజమాని ఇలియాజ్‌కు గుంటూరుకు చెందిన రేష్మితో వివాహేతర సంబంధం ఉంది. అతని భార్య హసీనా(35) వారి బంధానికి అడ్డుగా ఉందని రేష్మి భావించింది. దీంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకుని సబీనా, చాందినితో కలిసి సాయంత్రం ఇలియాజ్ ఇంటికి వచ్చింది. బురఖాలో వచ్చిన వారు ప్రార్ధన చేస్తామంటూ ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే రేష్మి తనతో పాటు తెచ్చిన పాయిజన్ ఇంజక్షన్‌తో ఇలియాజ్ భార్య హసీనాను పొడిచింది. దీంతో ఆమె నురగలు కక్కడం ప్రారంభించింది. కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడ గుమిగూడారు. ముగ్గురు మహిళలను స్థానికులు పట్టుకుని కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. హసీనాను స్థానికంగా ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నందున గుంటూరుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆమెను గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. హసీనా మృతికి కారణమైన రేష్మిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వడదెబ్బకు ఐదుగురు మృతి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు/కడప/అనంతపురం, ఏప్రిల్ 26: కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మంగళవారం వడదెబ్బకు ఐదుగురు మృతిచెందారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామానికి చెందిన చాకలి వెంకటేష్ (38), ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి గ్రామానికి చెందిన మక్తుమేసాహెబ్ (65), దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన వెంకటనాగపులయ్య (33), అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఆంజనేయులు (52), కడప జిల్లా చెన్నూరు కొత్తరోడ్డుకు చెందిన రమణమ్మ (75) వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.