రాష్ట్రీయం

నేడే నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 27: మరో చారిత్రక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. మరి కొన్ని గంటల వ్యవధిలోనే ఇస్రో శాస్తవ్రేత్తలు సొంత నావిగేషన్ వ్యవస్థ అధ్యయానికి సర్వసిద్ధం చేశారు. సరికొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే మనకు సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా 1425కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 26న మంగళవారం ఉదయం 9:20గంటలకు ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది.
మన దేశ నావిగేషన్ సేవల అవసరాల నిమిత్తం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థలను రూపొందించుకొనేందుకు ఇస్రో ఏడు ప్రయోగాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఇప్పకే ఆరు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. గురువారం నాటి ప్రయోగం చివరి ప్రయోగం కావడం విశేషం. ఇది విజయవంతంమైతే జిపిఎస్ సేవలు అందుబాటులోకి రానుంది. కౌంట్‌డౌన్ సమయంలోరాకెట్‌లోని నాలుగో దశలో 2.5టన్నులు, రెండో దశలో 2.5టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతోపాటు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరు తదితర వాటిని పరిశీలించి గ్లోబల్ పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్.కిరణ్‌కుమార్ బుధవారం మధ్యాహ్నం షార్‌కు చేసుకొని ప్రయోగ వేదికపై ఉన్న పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ను శాస్తవ్రేత్తలతో కలసి పరిశీలించారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగ ఏర్పాట్లను అడిగి తెలుసుకొన్నారు. ప్రయోగ సమయంలో 320టన్నుల బరువు, 44.4మీటర్ల ఎత్తుకలిగిన పిఎస్‌ఎల్‌వి రాకెట్ భూమి నుండి ఎగిరిన తరువాత దశల వారీగా నాలుగు దశలను పూర్తిచేసుకొనిన అనంతరం 20నిమిషాలకు ఉపగ్రహాన్ని భూమికి 284కి.మీ ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను తలమునకలవ్వడంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 35వ ప్రయోగం కాగా నావిగేషన్ సిరిస్‌లో ఏడో ప్రయోగం కావడం గమనార్హం. రాకెట్‌ను భూమి నుండి వేగంగా నెట్టేందుకు రాకెట్ మొదటి దశలో ఆరు స్ట్ఫ్రాన్ ఎక్స్‌ఎల్ మోటార్లను బిగించి ఉన్నారు. ఈ తరహా ప్రయోగం మొదట చంద్రయాన్-1లో ఉపయోగించి ఉన్నారు.