రాష్ట్రీయం

చల్లారని మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, ఏప్రిల్ 27: విశాఖ జిల్లా దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ ఫ్యూయల్స్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు అలా ఎగసిపడుతూనే ఉన్నాయి. మూడు జిల్లాలకు చెందిన అగ్నిమాపక కేంద్రాల నుంచి వాహనాలు, ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. ప్లాంట్‌లోని ఇంధన నిల్వల ట్యాంకుల్లో మంటలు అదుపులోకి తేవడం యంత్రాంగానికి సాధ్యం కావడం లేదు. ఇదే ప్రాంతంలోని మరికొన్ని ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా అధికారులు ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ట్యాంకుల నుంచి ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ ఘటనాస్థలిలో ఉండి మంటలను అదుపుచేసే పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన బయోమ్యాక్స్ కంపెనీని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సందర్శించారు. ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా సహాయచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు తూర్పు నౌకాదళం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే నౌకాదళం అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తొమ్మిది ఫైరింజన్లును హుటాహుటిన పంపారు. అలాగే ప్రమాద తీవ్రతను అంచనావేసేందుకు నౌకాదళానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు గగనతలం నుంచి సేవలందించేలా సిద్ధం చేశారు.
ఇలా ఉండగా భారీ అగ్నిప్రమాదానికి బయోమ్యాక్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోందని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ త్రిపాఠి పేర్కొన్నారు. కంపెనీలో ప్రమాదం సంభివిస్తే తక్షణమే నియంత్రించేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచలేదన్నారు. అలాగే ఇంధనం నిల్వచేసే ట్యాంకుల మధ్య దూరం లేకపోవడంతో మంటలు ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించి ప్రమాదం తీవ్రతను పెంచాయని పేర్కొన్నారు. ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించే యంత్రాంగంతో పాటు అవసరమైన నియంత్రణ పరికరాలను కంపెనీ సిద్ధం చేసుకోలేదన్నారు. ఇదే అంశంపై జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తర్వాత గంట వరకూ యాజమాన్యం స్పందించలేదన్నారు.