రాష్ట్రీయం

మూడు కాళ్లతో శిశువు జననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఏప్రిల్ 27: కృష్ణా జిల్లా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వింతశిశువు జన్మించింది. గన్నవరం మండలం వీరపనేనిగూతెం గ్రామానికి చెందిన షేక్ బాషా, హసీనా దంపతులకు రెండో సంతానంగా మూడు కాళ్లతో మగబిడ్డ జన్మించింది. మధ్యాహ్నం 3.45 గంటలకు గైనకాలజిస్టు డాక్టర్ అరుణ కాత్యాయిని హసినాకు డెలివరీ నిర్వహించారు. సాధారణ ప్రసవంలో జన్మించిన మగ బిడ్డకు మూడు కాళ్లు ఉండటంతో అరుదైన వింత శిశువు జన్మించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే శిశువు జన్మించగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉదయం 7 గంటలకు కాన్పుకోసం హసీనా తల్లితో సహా వచ్చి ఆసుపత్రిలో చేరింది. జన్యుపరంగా ఏర్పడే అసమతుల్యత కారణంగా ఇటువంటి జననాలు, మరణాలు సంభవిస్తాయని భావిస్తున్నారు. కాగా మొదటి సంతానంగా పాప జన్మించగా, ద్వితీయ సంతానంగా మగ శిశువు జన్మించినట్లు హసీనా తెలిపారు. వింత శిశువును ప్రజలు ఎంతో ఆసక్తితో చూశారు. శిశువుకు రెండు కాళ్లు యథావిధిగా ఉండగా, మూడో కాలు ఎడమవైపు నడుము వద్ద వీపుకు ప్రక్కన ఉండటం విశేషం. తల్లి క్షేమంగా ఉందని బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.