రాష్ట్రీయం

‘పాలమూరు’ డిజైన్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27:పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ ఖరారయిందని, ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 12లక్షల 30వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు, నల్లగొండలో 30వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఈ జిల్లాల ప్రజలతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలు తీరుస్తుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 120 టిఎంసిల నీటిని ఈ పథకానికి వినియోగించుకుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదు దశలుగా నీటిని ఎత్తిపోస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కెపి లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌కు, నార్లాపూర్ రిజర్వాయర్, యెదుల బ్యాలెన్సింగ్ రిజర్యాయర్, వట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కురుముత్యార్యా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉద్ధండపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు. ఆరు పంపు హౌస్‌లు, ఆరు ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా నీటిని తరలిస్తారు. మొత్తం 69.60 టిఎంసిల సామర్ధ్యం. ఈ ప్రాజెక్టు వల్ల 24 గ్రామాల్లోని 25, 000 వేల ఎకరాల భూమి ముంపు పాలవుతుంది.
ఈ ప్రాజెక్టు వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 11నియోజక వర్గాల పరిధిలోని 37 మండలాలు, 718 గ్రామాలకు సాగునీరు లభిస్తుంది. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలోని ఏడు నియోజక వర్గాల పరిధిలోని 26 మండలాలు, 400 గ్రామాలకు, నల్లగొండ జిల్లాలోని ఐదు మండలాల్లోని 13 గ్రామాలకు సాగునీరు లభిస్తుంది. హైదరాబాద్ నగరంతో పాటు సాగునీరు లభించే గ్రామాలన్నింటికీ ఈ ప్రాజెక్టు కింద మంచినీటిని కూడా అందించనున్నట్టు నీటిపారుదల శాఖ తెలిపింది.