రాష్ట్రీయం

ఆర్డీఎస్‌కు అడ్డు తొలగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28:ఏళ్ల తరబడి కొరకరాని కొయ్యగా మారిన రాజోలిబండ డైవర్ష్‌న్ స్కీమ్ (ఆర్డిఎస్) సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఆర్డిఎస్ పనులను 50 రోజుల్లో పూర్తి చేస్తామని కర్నాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే తీవ్ర మంచినీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న మహబూబ్‌నగర్ జిల్లాలో దాహార్తిని తీర్చడానికి నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల రిజర్వాయర్‌కు 3 టిఎంసిల నీటిని తక్షణమే విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం అంగీకరించింది. ఆర్డిఎస్ సంబంధిత అంశాలపై చర్చించడానికి గురువారం నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి బృందం కర్నాటకకు వెళ్లింది. బెంగళూర్‌లో ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎంబి పాటిల్‌తో తెలంగాణ మంత్రుల బృందం చర్చలు జరిపింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలపై కృష్ణా నిగమ్ అధికారులు, తమ ముఖ్యమంత్రి చర్చిస్తారని పాటిల్ హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు ఆర్డిఎస్ కాలువ పనులను 50 రోజుల్లో పూర్తి చేయనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. కర్నాటకకు దిగువనున్న మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొనడంతో తాత్కాలిక ఉపశమనంగా నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువనున్న జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు 3 టిఎంసిల నీటిని విడుదల చేయడానికి కూడా మంత్రి పాటిల్ అంగీకారం తెలిపారు. ఆర్డిఎస్ పనులకు తమ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అయితే కర్నూలు రైతుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించాల్సిందిగా పాటిల్ సూచించారు. దీంతో బెంగళూర్ నుంచే ఫోన్లో మంత్రి హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమతో మాట్లాడారు. వచ్చే నెల మే 4వ తేదీ తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని దేవినేని ఉమ హామీ ఇచ్చినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగే చర్చల్లో ఆర్డిఎస్‌తోపాటు పులిచింతల పునరావాసంపై కూడా చర్చించడానికి అంగీకరించినట్టు ఆయన వెల్లడించారు. తాము పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని కర్నాటక ప్రభుత్వానికి మంత్రి హరీశ్‌రావు వివరించారు. తమ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించబోయే ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఇటీవల చేసుకున్న ఒప్పందాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా వివరించారు. కర్నాటక, తెలంగాణ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ఆర్డిఎస్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు 15.9 టిఎంసిల నీరు రావాల్సి ఉండగా, కేవలం 5,6 టిఎంసిలు కూడా రావడం లేదని మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఆర్డిఎస్ కింద మహబూబ్‌నగర్ జిల్లాలో 87 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20 వేల ఎకరాలకు కూడా నీరు రావడం లేదని వివరించారు. పైగా ఆర్డిఎస్ నీటి విషయంలో కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల మధ్య తరుచు ఘర్షణలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్డిఎస్ బ్యారేజి ఎత్తు పెంచితే నీటి వివాదం తీరుతుందని, బ్యారేజి ఎత్తు పెంచడానికి కర్నాటక ప్రభుత్వం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 59 కోట్లు డిపాజిట్ చేసిందని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. బ్యారేజి ఎతర్త పెంచే పనులు ఇప్పటి వరకు 29 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని, మిగతా పనులను వచ్చే 50 రోజుల్లో పూర్తి చేస్తామని కర్నాటక మంత్రి ఎంబి పాటిల్ హామీ ఇచ్చినట్టు హరీశ్‌రావు తెలిపారు.

చిత్రం బెంగళూరులో గురువారం కర్ణాటక మంత్రి ఎంబి పాటిల్‌కు ఆర్‌డిఎస్‌పై వినతిపత్రాన్ని అందజేస్తున్న మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి తదితరులు