రాష్ట్రీయం

టెట్, ఎంసెట్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28:తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేటు విద్యా సంస్థల బెదిరింపులకు లొంగేది లేదని, తనిఖీలను ఆపేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. మే 1న జరగాల్సిన టెట్, మే 2వ తేదీన జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మే నెల 20 లోగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉపాధ్యాయుల పర్యవేక్షణతో, ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన సిబ్బందితో ఈ పరీక్షలు నిర్వహించాలని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, దీనిలో భాగంగానే తనిఖీలు జరిగి తీరుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రమాణాలు పాటించని, పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న బోగస్ విద్యా సంస్థలను ఏరివేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యలు ప్రైవేటు విద్యాసంస్థల జెఎసిగా చెప్పుకుంటున్న వారు వ్యతిరేకించడాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు. విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. విద్యా సంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసం అని ముఖ్యమంత్రి అన్నారు. తనిఖీలు నిర్వహించకుంటే ఏ విద్యా సంస్థ నడస్తోంది, సరైన ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. టెట్, ఎంసెట్ పరీక్షలను బహిష్కరించాలని ప్రైవేటు విద్యా సంస్థలు నిర్ణయించుకోవడం శోచనీయమని ముఖ్యమంత్రి అన్నారు. విద్యాసంస్థల్లో పోలీసులు తనిఖీలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పరిస్థితిని చూసి చలించి, స్పందించామని, విచారణ జరిపించాల్సిందిగా విద్యా శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయని, ఈ తనిఖీల్లో అనేక సంస్థలు భాగస్వాములుగా ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. థర్డ్ పార్టీగా బిట్స్ పిలానీ, ట్రిపుల్ ఐటి లాంటి సంస్థలు కూడా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థల బెదిరింపులకు లొంగేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తనిఖీలు జరుగుతాయని చెప్పారు.
తనిఖీలపై హైకోర్టు స్టే
తెలంగాణ ప్రభుత్వం పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ప్రైవేటు వృత్తివిద్యా కళాశాలల పనితీరుపై జరుపుతున్న విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర స్టే మంజూరు చేసింది. ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ భవిత డిగ్రీ కళాశాలతోపాటు మరో నాలుగు కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు జడ్జి జస్టిస్ పివి సంజయ్‌కుమార్ మధ్యంతర స్టే మంజూరు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్ శ్రీరామ్ తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య విద్యాచట్టానికి విరుద్ధమని అన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఏమిటని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు శుక్రవారం వరకు సమయం ఇస్తే ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుని కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అనంతరం పిటిషనర్ల తరపు న్యాయవాది మాట్లాడుతూ పోలీసు బృందాలను ఇప్పటికే సిద్ధం చేసినందున, వారు ఏ క్షణమైనా కాలేజీలను సందర్శించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో మధ్యంతర స్టే మంజూరు చేస్తూ ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.