రాష్ట్రీయం

తక్షణమే బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్ర విద్యుత్ సంస్థలకు బకాయి ఉన్న రూ. 2585 కోట్లను తెలంగాణ విద్యుత్ సంస్థలు తక్షణమే చెల్లించాలని, విద్యుత్ సౌధ విభజనకు ప్రత్యేక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు, డిస్కంల వద్ద ఏపిఎస్‌ఇబి ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఇంజనీర్లు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిఎస్‌ఇబి ఇంజనీర్ల సంఘం సెక్రటరీ జనరల్ ఎం వేదవ్యాసరావు విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇంతవరకు తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపి జెన్‌కోకు గ్రిడ్ నుంచి విద్యుత్ డ్రా చేస్తున్నందుకు రూ.2300 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. ఏపి జెన్ కో ఈ విషయమై కఠినంగా వ్యవహరించకపోతే తెలంగాణ జెన్‌కో నుంచి బకాయిలు రావన్నారు. ఏపి ట్రాన్స్‌కోకు విద్యుత్ పంపిణీకి వాడుకున్నందుకు రూ. 275 కోట్ల బకాయిలను తెలంగాణ సంస్ధలు చెల్లించాల్సి ఉం దన్నారు. ఇప్పటికే ఈ బకాయిల వల్ల ఏపి విద్యుత్ సం స్ధలపై భారం పెరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగుల విభజనకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసే సిఫార్సులు రెండు రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలన్నారు. ఈ సిఫార్సులు వివాదాలకు తావిచ్చే విధంగా ఉండరాదన్నారు. హైదరాబాద్‌లో సిపిడిసిఎల్‌లో 26.31 శాతం ఆస్తిని, సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆస్తిని ఏపిఎస్‌పిడిసిఎల్‌కు కేటాయించాలన్నారు. వీటి మార్కె ట్ విలువ రూ. 200 కోట్లన్నారు. విద్యుత్ సౌధ లో కూడా జనాభా ప్రాతిపదికన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు 58, 42 శాతం మేరకు కేటాయించాలన్నారు. దీని వల్ల ఆంధ్ర రాష్ట్రానికి వెయ్యి కోట్ల లాభం చేకూరుతుందన్నారు. ఏపి పునర్వ్యవస్ధీకరణ చట్టం మేరకు పదవ షెడ్యూల్ కింద ఉన్న ఆస్తుల విభజనలో సుప్రీం కోర్టు లో ఒక కేసులో ఇచ్చిన తీర్పును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజనలో కూడా సయోధ్యతో వ్యవహరించాలని, చట్టం ప్రకారం నడుచుకోవాలని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు.

చిత్రం
ఏపిఎస్‌ఇబి ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం డిస్కంల వద్ద ధర్నా చేస్త్తున్న ఇంజనీర్లు