రాష్ట్రీయం

అవినీతి అధికారులపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసేందుకు ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషనర్ డాక్టర్ ప్రేమ్‌చంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా తడ మండలం బివి పాలెం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై విచారణ నిర్వహించాలని ఆదేశించింది. ఐదుగురు సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, ఒక ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ఇద్దరు వాణిజ్యపన్నుల శాఖ జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు ఎసిటివోలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు గాను ఎంక్వయిరీ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఎసిబి అధికారులు విచారణ అధికారికి సమర్పించాలని, నివేదికను రెండు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర ఉత్సవంగా మోదకొండమ్మ తల్లి జాతర
విశాఖ జిల్లా పాడేరు వద్ద ఉన్న మోదకొండమ్మ తల్లి జాతరను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు వీలుగా ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రాంతంలో గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగే ఈ జాతరను అద్భుతంగా నిర్వహిస్తారని, దీనిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు అనుగుణంగా గిరిజన శాఖ నుంచి నిధులను వెచ్చించేందుకు అనుమతిచ్చింది.
జివిఎంసి కమిషనర్‌గా విశాఖ కలెక్టర్‌కు బాధ్యతలు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా విశాఖ జిల్లా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 30 వరకు లేదా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే వరకు కలెక్టర్ ఇన్‌చార్జి కమిషనర్‌గా కొనసాగుతారని తెలిపింది.