రాష్ట్రీయం

1న క్యాబినెట్ మీటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల ఒకటో తేదీన విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎండల తీవ్రత, తీసుకుంటున్న జాగ్రత్తల గు రించి చర్చించనున్నారు. అలాగే కృష్ణా పుష్కర పనులను సమీక్షించి, తీసుకోవల్సిన చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది.

ఆంధ్రాలో లాజిస్టిక్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద లాజిస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలనూ ప్రారంభించింది. ఇందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఆర్ సి సిన్హాను చైర్మన్‌గా నియమించింది. పిడబ్ల్యుడి మాజీ కార్యదర్శి జందార్, రవాణా అధిపతి ఆర్ కె జాను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ కానె్సప్ట్‌ను, ప్రాజెక్టు కాలపరిమితిని, ఆర్ధిక అంశాలను, పిపిపి విధానాన్ని ఖరారు చేస్తుంది.

లోకేష్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు దారుణం:డొక్కా
హైదరాబాద్, ఏప్రిల్ 28: అవినీతిపై చర్చకు సిద్ధమని లోకేష్ విసిరిన సవాల్‌పై వైకాపా నేతలు జగన్, రోజాలు అవాకులు, చెవాకులు పేలడం సరికాదని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ లోకేష్ విసిరిన సవాల్‌ను ధైర్యంగా స్వీకరించకుండా వ్యక్తిగతంగా మాట్లాడటం దారుణమని అన్నారు.లోకేష్ చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అని, పార్టీ నాయకత్వం స్వీకరించడానికి అన్ని అర్హతలూ ఆయనకు ఉన్నాయని పేర్కొన్నారు.