రాష్ట్రీయం

నేడు యథావిధిగా ఎపి ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 28: ఎపి ఎంసెట్-2016ను ముందు ప్రకటించిన విధంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో యథావిథిగా నిర్వహిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. దేశంలో అన్నిరకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లను ఒక కామన్ ఎగ్జామ్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పద్ధతిలో ఎంసెట్ నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ప్రతినిధులంతా కలసి న్యాయ నిపుణుల ద్వారా కొన్ని క్లాజ్‌లను ఆధారంగా చేసుకుని యధావిధిగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే స్టేట్ కౌన్సిల్ ఢిల్లీ వెళ్ళి సమస్య పరిష్కరించిందని, దీనితో కామన్ ఎగ్జామ్ పద్ధతిలో కాకుండా ఎంసెట్-2016 నిర్వహణకు మార్గం సుగమమైందని ఆయన వివరించారు. గురువారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో డాక్టర్ సాయిబాబు మాట్లాడారు. ఎంసెట్‌లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులను జీవితాంతం ఇక ఏ విధమైన ఎంట్రన్స్ టెస్టుల్లో పాల్గొనే అవకాశం లేకుండా బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. జెఎన్‌టియుకె ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 22 రీజనల్ సెంటర్లు, తెలంగాణలోని హైదరాబాద్‌లో 2 రీజనల్ సెంటర్లు మొత్తం 24 రీజనల్ సెంటర్ల పరిధిలో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఎపి ఎంసెట్-2016కు 2,92,507 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో ఇంజనీరింగ్‌కు లక్ష 89వేల 273 మంది, మెడిసిన్, అగ్రికల్చర్‌కు లక్ష 3వేల 234 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. గతేడాదితో పోల్చిచూస్తే ఈ సంవత్సరం 37,094 దరఖాస్తులు అధికంగా దాఖలయ్యాయన్నారు. ఇంజనీరింగ్‌కు 355 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా వీటిలో 22 పరీక్షా కేంద్రాలను తెలంగాణలోని 2 రీజనల్ సెంటర్ల పరిధిలో ఏర్పాటుచేశామన్నారు. మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షకు 191 సంబంధించి కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 26 తెలంగాణలో ఏర్పాటుచేశామన్నారు.
తెలంగాణలో ఇంజనీరింగ్ విభాగానికి 18,888 మంది, మెడిసిన్, అగ్రికల్చర్‌కు 23,594 మంది మొత్తం 42,482 మంది దరఖాస్తు చేసుకున్నారని సాయిబాబు తెలిపారు. ప్రిలిమినరీ కీని శుక్రవారం సాయంత్రం వెబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తామని, పరీక్షల ఫైనల్ కీని మే 9న విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షకు 160 మార్కులకు 40 మార్కులను కనీస అర్హతగా పరిగణిస్తామన్నారు. ర్యాంకుల నిర్ధారణకు ఎంసెట్ మార్కులను 75 శాతం వెయిటేజీ గాను, 25 శాతం ఇంటర్మీడియెట్ మార్కులు వెయిటేజీగాను తీసుకుంటామన్నారు. ఎస్సీ ఎస్టీలకు అర్హతా మార్కులు లేవని తెలిపారు. ఉదయం 10నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు కాకినాడ జెఎన్‌టియుకెలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి సెట్ కోడ్‌ను విడుదల చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు సంబంధించి సెట్ కోడ్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ విడుదల చేస్తారని డాక్టర్ సాయిబాబు వివరించారు.
హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్సెట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంది. పరీక్ష సజావుగా సాగేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎపి హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.