రాష్ట్రీయం

విచారణకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండేళ్లలో పాల్పడిన అవినీతిపై సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు టిడిపి సిద్ధపడుతుందా అని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ను గత రెండేళ్లలో చంద్రబాబు, లోకేష్ అవినీతితో 1.34 లక్షల కోట్లను దోచుకున్నారన్నారు. చంద్రబాబు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారన్నారు. గురువారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి చరిత్రను చూసి రాష్టప్రతి నుంచి కేంద్ర మంత్రులు వరకు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేయడంపై జాతీయ స్ధాయిలో అన్ని పార్టీల నేతలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్‌పై అభియోగాలు మోపారని, ఇవన్నీ కోర్టు విచారణలో దూదిపింజలా ఎగిరిపోతాయాన్నారు. తనపై వచ్చిన అభియోగాలను జగన్ ధైర్యంగా కోర్టు విచారణలను ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రతిపక్షనేతగా కేంద్ర మంత్రి చిదంబరంను కలిసి ఆరోపణలపై విచారణ లేకుండా చూసుకున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆమె దుమ్మెత్తిపోశారు. కల్తీ మద్యం, కాల్‌మనీ సెక్స్‌రాకెట్, రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూముల సేకరణలో టిడిపి పెద్దల హస్తం ఉందన్నారు.