రాష్ట్రీయం

మళ్లీ నీట్ గందరగోళం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశానికి ఏకీకృత పరీక్షను నిర్వహించాల్సిందేనని గురువారం సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆ ఉత్తర్వులు వర్తిస్తాయా లేదా అనే మీమాసంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పడ్డాయి. సుప్రీం ఆదేశాలు అనేక సాంకేతిక కారణాల వల్ల ఈ రెండు రాష్ట్రాలకూ వర్తించవని ఓ పక్క న్యాయ నిపుణులు చెబుతూంటే దీనిపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచి తూచి స్పందించాయి. సుప్రీం తీర్పు రాగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్య మంత్రులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల బంద్ ప్రకటనతో ఎమ్సెట్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది, ఎమ్సెట్‌తో పాటు టెట్‌ను సైతం తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. పనిలోపనిగా సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఎమ్సెట్‌పై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నత విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ నిరాకరించారు. తీర్పు పాఠం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించిన తర్వాత తదుపరి ప్రకటన చేస్తామని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లో ‘నీట్’ను అమలుచేసి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినా ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు వర్తించదని న్యాయనిపుణులు అంటున్నారు.దీనికి కారణం ఈ మూడు రాష్ట్రాలకు రాజ్యాంగ నిబంధన 370(డి) కింద ప్రత్యేక అధికారాలు కల్పించడమేనని స్పష్టం చేశారు. ఈ నిబంధన ప్రకారమే రాష్ట్రంలో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిబంధన వర్తించకుండా ఉండాలంటే రాష్టప్రతి ఆమోదం అవసరం. దీనికి ముందు పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాతీయరాజ్, ప్రభుత్వ టీచర్ల మధ్య గత 15 ఏళ్లుగా ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలుకు పెద్ద అడ్డంకిగా ఉన్నది కూడా ఈ రాజ్యాంగ నిబంధనే! దీనివల్లనే ప్రభుత్వాలు అనేక మార్లు ఆర్డినెన్స్‌లు ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానాలు చేసినా ఉమ్మడి సర్వీసు రూల్స్ నేటికీ అమలులోకి రాలేదు. ఈ నిబంధన ప్రకారమే ఆంధ్రాలోనూ, తెలంగాణలోనూ అదే విధంగా జమ్మూ కాశ్మీర్‌లోనూ జోనల్ విధానం అమలులో ఉంది. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ జోనల్ విధానం అమలులో లేదు. జిల్లా క్యాడర్, రాష్ట్ర క్యాడర్‌గా రెండు విభాగాలే తప్ప మధ్యలో జోనల్ విధానం అమలులో లేదు.
సుప్రీంకోర్టు మాత్రం తన ఆదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేయాలని పేర్కొన్నా తీర్పు పాఠంలోనే 2010 డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘నీట్’ నోటిఫికేషన్ యథాతథంగా అమలులో ఉంటుందని పేర్కొంది. 2010 డిసెంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేయలేదు. మిగిలిన అన్ని రాష్ట్రాలూ ఆ నోటిఫికేషన్‌ను అమలుచేశాయి. 2011, 2012 సంవత్సరాల్లో నీట్ నోటిఫికేషన్ వచ్చినా, అందులో ఆంధ్రప్రదేశ్ చేరలేదు. అపుడు యథాతథంగా ఎమ్సెట్‌ను నిర్వహించారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఆనాడు దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు నీట్ ఆధీనంలోకే వచ్చాయి. కాని ఆంధ్రప్రదేశ్ రాలేదన్న అంశాన్ని న్యాయనిపుణులు గుర్తుచేస్తున్నారు.