రాష్ట్రీయం

తిరుమలలో వివాహాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుమలలో టిటిడి కల్యాణ వేదికలో వివాహాలు చేసుకునే వధూవరులకు మే 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని టిటిడి ఇ ఒ సాంబశివరావు ఐటి అధికారులను ఆదేశించారు. గురువారం టిటిడి పరిపాలనాభవనంలో తన కార్యాలయంలో ఆయన ఐటి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 9న అక్షయ తృతీయ సందర్భంగా ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు. తిరుమల్లో వివాహం చేసుకునేవారికి వసతి, దర్శనం, లడ్డూ ప్రసాదాలకు సంబందించిన సంక్షిప్త సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. వివాహం చేసుకునే వధూవరుల వయస్సు నిర్ధారణకు సంబందించిన స్కూల్ సర్ట్ఫికెట్లను పొందుపరచాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆధార్,రేషన్, ఓటరు కార్డుల్లో ఒకటి తప్పనిసరిగా సమర్పించాలన్నారు. నూతన వధూవరులను వారి తల్లితండ్రులను కలిపి మొత్తం ఆరుగురికి రూ.300 శీఘ్రదర్శనం క్యూలైన్లో పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీరికి రూ.25 చొప్పున ఒక్కొక్కరికి రెండు లడ్డూలు ఇవ్వాలన్నారు. వధూవరులకు పసుపు,కుంకుమ, కంకణాలు చిన్న లడ్డూలతో కూడుకున్న ప్యాకెట్లు ప్రతి దంపతులుకు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కల్యాణ వేధిక వద్ద వధూవరుల బంధు మిత్రులకు అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు.