రాష్ట్రీయం

విజిలెన్స్ దాడులకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో తనిఖీలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేవనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ విజిలెన్స్ దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులను వెంటనే ఆపాలంటూ జూనియర్ కాలేజీల జెఇసి నిరసన వ్యక్తం చేయడంతో పాటు మే 1, 2తేదీల్లో జరిగే టెట్, ఎమ్సెట్ పరీక్షలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఈ రెండు పరీక్షలను వాయిదా వేసింది. కొన్ని కాలేజీల తరఫున ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సింగిల్ బెంచి కాలేజీల యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం శుక్రవారం నాడు డివిజన్ బెంచిలో అప్పీలు చేసింది. చాలా వరకూ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేవని, కనీసం కొన్నింటిలో ల్యాబ్‌లు కూడా ఉండటం లేదని, తగినంత మంది క్వాలిఫైడ్ అధ్యాపకులు కూడా లేరని, చదువులో నాణ్యత బాగుండాలంటే ఇంటర్మీడియట్ స్థాయి నుండి దృష్టి పెట్టాలని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. తొలుత ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి భోసలే , జస్టిస్ పి నవీన్‌రావుల బెంచ్ ముందు సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేశారు. అయితే తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని, సింగిల్ జడ్జి ముందు తమ వాదనలు వినిపించాలని హైకోర్టు పేర్కొంది. అనంతరం అదనపు అడ్వకేట్ జనరల్ జస్టిస్ పివి సంజయ్ కుమార్ ముందు తమ వాదనలు వినిపించారు. తనిఖీలకు విద్యాశాఖ సిబ్బందికి భద్రతగా మాత్రమే పోలీసులను వినియోగించాలని, అదీ వారు యూనిఫారంలో కాకుండా సివిల్ దుస్తుల్లోనే వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. ఒక దశలో న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యాశాఖ అధికారులపై మీకు నమ్మకం లేకపోతే ఆ శాఖను మూసివేయండి, తనిఖీలకు డిజిపిలు, ఎసిబి సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది ఎందుకు? సుపరిపాలనకు వీరందర్నీ ఉపయోగించుకోవచ్చని ఎక్కడైనా ఉందా...చూపించండి అంటూ న్యాయమూర్తి ఎఎజిని నిలదీశారు. చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను జూన్ 16కు న్యాయమూర్తి వాయిదా వేశారు.