రాష్ట్రీయం

ఖరీఫ్‌కు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29:ఈసారి వర్షపాతం బాగుంటుందని 106శాతం వర్షపాతం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర్‌రావు తెలిపారు. మే 15న మరోసారి వాతావరణ అధ్యయన నివేదిక వెలువడిన తరువాత మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. కరవు, వడగాడ్పులు, ఎండ వేడిమి సమస్యలు ఇంకా నెలన్నర రోజుల పాటు ఇలానే ఉంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రలో శుక్రవారం కరవు సమస్యపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈసారి మంచి వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నందున ఖరీఫ్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈసారి మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకె రెడ్డి సమావేశంలో చెప్పారు. కరువు, వడగాడ్పులు, ఎండ వేడిమి, భూ గర్భ జలాలు తగ్గిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలకు కావలసిన సహాయ చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పనులను మధ్యాహ్నాం చేయించవద్దని, ఉదయం సాయంత్రం సమయాల్లోనే పనులు చేయాలని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో వడ దెబ్బకు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏ ప్రాంతంలోనైనా ప్రజలు తిండికి లేక బాధపడితే వెంటనే స్పందించాలని ప్రభుత్వం అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పశుగ్రాసం ఎక్కడెంత అవసరముందో అంచనా వేసి, అందజేయాలని చెప్పారు.
వడదెబ్బ వల్ల మరణించిన వారెవరైనా సరే ఆపద్బంధు పథకం ద్వారా సహాయం అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. 65 సంవత్సరాల లోపు వారికే వర్తింపజేయాలనే నిబంధనను తొలగించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నందున మంచి నీటికి సమస్యలు ఉన్నాయని మరో నెలన్నర వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, మంచినీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా రవాణా చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనులు ఉదయం పదిన్నర లోపు, సాయంత్రం నాలుగున్నర తర్వాత చేయించాలని చెప్పారు.
కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు ఎస్‌పి సింగ్, ఎస్‌కె జోషి, బిఆర్ మీనా, సురేష్ చంద్ర, తివారి, శరత్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం కరవు నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్