రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 29: ఎపి ఎంసెట్- 2016 శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరిగింది. 94.84 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎంసెట్-2016 నిర్వహించారు.
ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఉన్న త విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్‌కు సంబంధించి సెట్ కోడ్‌ను కాకినాడలో విడుదల చేయగా, 9 గంటలకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షల సెట్ కోడ్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో 22 రీజనల్ సెంటర్లు, తెలంగాణలోని హైదరాబాద్‌లో 2 రీజనల్ సెంటర్ల పరిధిలోని ఆయా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 95.05 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 1,70,343 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,61,916 మంది పరీక్షకు హాజరు కాగా, 8427 మంది గైర్హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో 92.89 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 18,888 మంది దరఖాస్తు చేసుకోగా 17,546 మంది హాజరు కాగా 1,342 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌కు సంబంధించి 1,89,231 మంది దరఖాస్తు చేసుకోగా 1,79,462 మంది పరీక్షకు హాజరు కాగా 9769 మంది గైర్హాజరయ్యారు.
మెడిసిన్, అగ్రికల్చర్‌కు సంబంధించి 1,03,222 మంది దరఖాస్తు చేసుకోగా 98,750 మంది పరీక్షకు హాజరయ్యారు. 4472 మంది గైర్హాజరయ్యారు. అంటే 95.67 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
అగ్రికల్చర్, మెడిసిన్ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 95.64 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. 79,629 మంది దరఖాస్తు చేసుకోగా 76,159 మంది పరీక్షకు హాజరు కాగా 3470 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తెలంగాణలో 95.75 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 23,593 మంది దరఖాస్తు చేసుకోగా 22,591 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,002 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ఎపి ఎంసెట్‌కు 2015లో 95.39 శాతం విద్యార్థులు హాజరు కాగా 2016లో 94.84 శాతం విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరైనట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. అధికార యంత్రాంగం సహాయంతో పరీక్షలను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు.
ఖచ్చితమైన నిబంధనలు విధించిన కారణంగా అన్ని కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకున్నారని, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించగలిగినట్టు డాక్టర్ సాయిబాబు తెలిపారు.

chitram ఎంసెట్ ఇంజనీరింగ్ సెట్ కోడ్‌ను విడుదల చేస్తున్న
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు