రాష్ట్రీయం

ఉద్యమ స్ఫూర్తితో హరిత హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: గత ఏడాది వర్షాలు సరిగా పడనందున హరిత హారం కార్యక్రమంలో అనుకున్న విధంగా మొక్కలు పెంచలేకపోయినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఈసారి వర్షాలు బాగుంటాయని, తెలంగాణ వ్యాప్తంగా హరిత హారం నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో హరిత హారం చేపట్టి సమాజంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేయాలని అన్నారు. జిల్లాల వారిగా కార్యాచరణ రూపొందించాలని, ఇండ్లలో పెంచడానికి అవసరమైన మొక్కలు సరఫరా చేయాలని చెప్పారు. గుంతలు తీసే పనిని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్‌ఎఫ్‌ఆర్ భూముల్లో యూకలిప్టస్ మొక్కలు పెంచాలని సూచించారు. జాతీయ రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని చెప్పారు.
హరిత మిత్రులు
మొక్కలు నాటి, పెంచే విషయంలో స్ఫూర్తిదాయక పాత్ర నిర్వహించే వారికి హరిత మిత్ర అవార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీని కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.
250 గురుకుల పాఠశాలలు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరమే 250 గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచే మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీల కోసం 250 గురుకుల పాఠశాలలు నడపాలని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. గురుకుల పాఠశాలల భవనాలు నిర్మించేంత వరకు కొంత సమయం పడుతుందని, తరగతులు, హాస్టళ్ల నిర్వహణకు అద్దె భవనాలు సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. మైనారిటీ గురుకులాల కోసం ఇప్పటికే స్థల సేకరణ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కోసం కూడా స్థల సేకరణ జరగాలని చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల మాదిరిగానే కొత్త గురుకులాలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
ఐదు గంటల సమావేశం
జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఐదు గంటల పాటు సమావేశం అయ్యారు. కరవుతో పాటు వివిధ అంశాలపై చర్చించారు.