రాష్ట్రీయం

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ, తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలు పెరిగి, వడగాడ్పుల తీవ్రత పెరుగుతూ వచ్చినా, కోస్తాంధ్రలో ఒక మాదిరిగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మార్పు వచ్చింది. కోస్తాంధ్రలో సైతం వడగాడ్పులు సెగ పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత కూడా కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు డిగ్రీలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండ తీవ్రత కన్నా వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. జంగమేశ్వరం, అనంతపురంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో భద్రాచలం, హన్మకొండ, నల్గొండ, రామగుండంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు మే మొదటి వారానికి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.