రాష్ట్రీయం

ప్రాణహాని ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో పాటు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం హైకోర్టులో జస్టిస్ రాజశేఖర రెడ్డి ముందు పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించేట్లుగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు. టిఆర్‌ఎస్ నేతలమంటూ తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులపైనా నమ్మకం లేదని, అందుకే కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని కూడా మహబూబ్‌నగర్ ఎస్పీని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.