రాష్ట్రీయం

మే16 తరువాత సమ్మె నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ఆర్టీసిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడంతో దశలవారీగా పోరాటాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు టిఎస్‌ఆర్టీసి కార్మిక జెఏసి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా మే 16లోగా సమస్యలను పరిష్కరించకపోతే జెఏసి సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది. శుక్రవారం నాడిక్కడ జెఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం జెఎసి కన్వీనర్ కె.రాజిరెడ్డి తదితరులు విలేఖరులతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీ పోరాటమే శరణ్యమని భావించినట్లు తెలిపారు. ఈ నెల 5న రాష్టవ్య్రాప్తంగా అన్ని డిపోలు, యూనిట్ల వద్ద ధర్నా నిర్వహించాలని, అనంతరం 9వ తేదీన హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని, అప్పటికీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపకపోతే మే 16న సమ్మె నోటీసు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించినట్లు ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అన్ని సర్వీసులకు పన్నులు రద్దు చేయాలని, డీజిల్, వాహన విడిభాగాలపై వ్యాట్‌ను తగ్గించాలని, ఆర్టీసికి ఉన్న అప్పులను ప్రభుత్వమే భరించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ కన్వీనర్ వి.ఎస్.రావు మాట్లాడుతూ సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని, సరుకుల రవాణా వ్యవస్థను చేపట్టేందుకు ఆర్టీసికి అనుమతి ఇవ్వాలని కోరారు. కో కన్వీనర్ జి.అబ్రహం మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగుల భార్యలకు కూడా డీలక్స్ సర్వీస్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, సూపర్‌లగ్జరీ, ఇంద్ర, గరుడ బస్సుల్లో 50 శాతం రాయితీతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో పాటు గతంలో సంస్థ దృష్టికి తీసుకెళ్లిన అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.