రాష్ట్రీయం

టిడిపిలోకి గాదె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 29: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి తెలుగుదేశం గూటికి చేరారు. శుక్రవారం గుంటూరు టుబా కో మర్చంట్స్ అసోసియేషన్ హాలు లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాదె వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడు గాదె వెంకటేశ్వరరెడ్డి, తనయుడు మధుసూదనరెడ్డి మరో 300 మందికి పైగా అనుచరులు, కార్యకర్తలకు పచ్చకండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహారశైలిపై గాదె వెంకటరెడ్డి తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. ఏకపక్షంగా విభజించిన పాపమే కాంగ్రెస్‌ను వెంటాడుతోందని విమర్శించారు. సీనియర్ల అభిప్రాయాలకు తమ పార్టీలో గౌరవం ఉంటుందన్నారు. గాదె వెంకటరెడ్డి రాజకీయ జీవితంలో వివాదరహితంగా నిబద్దతతో వ్యవహరించారని అలాంటి వారి సలహాలు, సూచనలు పార్టీకి అవసరమన్నారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చుక్కానిలేని నావను చేసినందునే తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. కొద్దిమంది చెప్పుచేతల్లో పడి, కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ అనే సంగతి కూడా విస్మరించి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి.. రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని అభినందించారు.

చిత్రం పార్టీ కండువా కప్పి టిడిపిలోకి గాదెని ఆహ్వానిస్తున్న చంద్రబాబు