రాష్ట్రీయం

బుర్రిపాలెంకు దీటుగా సిద్దాపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఏప్రిల్ 29: సూపర్‌స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంకు దీటుగా సిద్దాపూర్ గ్రామాన్ని అభివృద్ద్ధి చేసేందుకు సినీ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు సిద్ధ్దంగా ఉన్నారని ఆయన భార్య నమ్రత శిరోద్కర్ వివరించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామాన్ని నమ్రత శిరోద్కర్ సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ప్రిన్స్ మహేష్‌బాబు అభిమాన సంఘం సభ్యులు ఖాదర్‌ఘోరీతో పాటు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నమ్రత శిరోద్కర్ మాట్లాడుతూ దత్తత తీసుకున్న సిద్దాపూర్ గ్రామ అభివృద్ద్ధికి సమగ్ర ప్రణాళికలను సిద్ద్ధం చేస్తున్నట్లు వివరించారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధ్ది పనులపై కలెక్టర్‌తో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సినీమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రిన్స్ మహేష్‌బాబు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని ఆమె వివరించారు. రెండు వారాల్లో సిద్దాపూర్ గ్రామానికి మహేష్‌బాబును తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. గ్రామంలో విద్య, వైద్య, వౌలిక సదుపాయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. దత్తత గ్రామాన్ని అంచలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని భరోసా ఇచ్చారు. మూడు నెలలకోసారి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ద్ధిలో ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. మహేష్‌బాబు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల సిద్దాపూర్ గ్రామానికి రాలేకపోయారని, త్వరలోనే ఆయనను తీసుకువస్తానని వెల్లడించారు. మహేష్‌బాబు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో సర్వేలు చేపట్టనున్నట్లు తెలిపారు. దత్తత గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వైద్య సేవలపై వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు చూపించిన అభిమానానికి నమత్ర శిరోద్కర్ సంతోషం వ్యక్తం చేశారు.
గ్రామ సమస్యలను నమత్ర దృష్టికి
తీసుకువెళ్లిన సర్పంచ్
సిద్దాపూర్ గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్ నర్సమ్మ నమత్ర శిరోద్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం ఉదయం గ్రామానికి వచ్చిన నమత్ర శిరోద్కర్‌కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దాపూర్ గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పశువుల డాక్టర్ లేకపోవడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని రైతులు నమత్ర దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమత్ర శిరోద్కర్ స్పందిస్తూ గ్రామంలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు కలెక్టర్ శ్రీదేవితో మాట్లాడి గ్రామంలో పశువైద్యాధికారిని నియమించేందుకు కృషి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. అత్యవసర పనులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రిన్స్ మహేష్‌బాబు సినీమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోనేనని అభిమాన సంఘం అధ్యక్షుడు ఖాధర్‌ఘోరీ కొనియాడారు. శుక్రవారం కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామానికి వచ్చిన మహేష్‌బాబు భార్య నమత్ర శిరోద్కర్‌ను ఖాదర్‌ఘోరీ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

chitram సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని
నమ్రత శిరోద్కర్‌కు ఇస్తున్న సర్పంచ్ నర్సమ్మ