రాష్ట్రీయం

వెంకన్న బంగారం ఇక బ్యాంకుల్లో భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన 7.5 టన్నుల బంగారాన్ని పసిడి నగదీకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్) ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నామని తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జిఎంఎస్ ద్వారా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 1.3 టన్నుల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేశామన్నారు. డిపాజిట్ చేసిన బంగారానికి నగదు రూపంలో వడ్డీ తీసుకోబోమని, మళ్లీ బంగారానే్న వడ్డీగా తీసుకుని, దాన్ని కూడా తిరిగి బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తామన్నారు. ఈ అంశంపైనే ప్రస్తుతం ఉన్న చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు (తితిదే) ఏటా భక్తుల నుండి వేర్వేరు రూపాల్లో సుమారు 800 కిలోల బంగారం లభిస్తోందని సాంబశివరావు వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించేందుకు తితిదే సిద్ధంగా ఉందన్నారు. సంబంధిత రాష్ట్రాలు అవసరమైన భూమిని కేటాయిస్తూ తమకు (తితిదే) ప్రతిపాదనలు పంపించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 18 కోట్ల రూపాయల వ్యయంతో బాలాజీ ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు వివరించారు.