రాష్ట్రీయం

ఒక్క మాట మాట్లాడవేం బాబూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఆంధ్రనోట మట్టికొట్టే తెలంగాణకు చెందిన పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మూడు రోజుల దీక్షకు ఉపక్రమిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మే 16నుంచి మూడు రోజులపాటు కర్నూలులో నిరసన దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. కృష్ణా డెల్టాకు నీళ్ళురాకుండా మహబూబ్‌నగర్ నుంచే తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతలకు పాల్పడుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నోరెత్తరెందుకని జగన్ ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల దిగువనున్న ఆంధ్ర జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ చుక్క నీరు రాదని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నీటిని మహబూబ్‌నగర్ నుంచే మళ్లిస్తే శ్రీశైలం, దిగువనున్న నాగార్జునసాగర్‌కు నీరు విడుదల కాదని, దీంతో ప్రజల గొంతులు, పంట పొలాలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులకు ఆలోచన చేసి, శంకుస్థాపనలు చేస్తున్నా ఏపీ సిఎం చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. గట్టిగా నిలదీయడానికి కేసుల భయమా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నోటినుంచి ఒక్క మాట రావడం లేదన్నారు. అందరికీ కనువిప్పు కలగాలన్న ఉద్దేశంతోనే తాను నిరసన దీక్షకు నిర్ణయించినట్టు చెప్పారు. పాలమూరు నుంచి రంగారెడ్డికి ఎత్తిపోతల పథకం అని, డిండి ప్రాజెక్టు అంటున్నారని, మన కళ్లెదుటే 115 టిఎంసిల నీటిని తెలంగాణ సిఎం కెసిఆర్ తోడేస్తామంటే చంద్రబాబుకు అడగాలన్న ఆలోచన ఎందుకురావడం లేదని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లోనే ఎత్తిపోతలు పెట్టుకుని నీళ్ళు తోడేసుకుంటాం, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నీళ్ళు పంపుతామంటుంటే చంద్రబాబు మాట్లాడడం లేదని విమర్శించారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి నీరు వెళ్ళకపోతే కృష్ణా డెల్టా పరిస్థితిని ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు.
గోదావరి పరిస్థితి కూడా అంతేనన్నారు. జల ప్రవాహాన్ని మధ్యలోనే అడ్డుకుంటుంటే, చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు అంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమలో నీటి నిల్వ సామర్థ్యం లేదని, వరదలు వచ్చినప్పుడు కిందకు రావాల్సిందేనని జగన్ గుర్తు చేశారు. పోలవరం 190 టిఎంసిల లైవ్ స్టోరేజీలో ఉండే ప్రాజెక్టు అని, దాని పనులు 2.4 శాతమే పూరె్తైనట్టు కేంద్రమే చెబుతున్నా కాంట్రాక్టర్లను మార్చడం లేదన్నారు. అన్నీ కుంభకోణాలే కాబట్టి నిధులు ఇచ్చేందుకు కేంద్రమే భయపడుతోందని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు వైఖరికి నిరసనగా 16నుంచి మూడు రోజులపాటు స్వయంగా తానే దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు జగన్ చెప్పారు.
హోదాపై బాబు ఏమన్నారంటే?
ప్రత్యేక హోదాపై సిఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నారో, ఇప్పుడు ఏమంటున్నారో తెలియజేసే ‘సిడీ’ని జగన్ మీడియాకు చూపించారు. ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు మరో పదేళ్ళు కూడా ఇస్తామన్నారని చంద్రబాబు ఎన్నికలకు ముందు బుకాయించారని ఆయన తెలిపారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటే సంజీవని కాదని, హోదా వస్తే స్వర్గమైపోదని అంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఒకమాట, ఇప్పుడొక మాట మాట్లాడుతున్నందుకే కేంద్ర మంత్రులు కూడా బాహాటంగా హోదా అవసరం లేదన్న వ్యాఖ్యలు వదులుతున్నారన్నారు. చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నా ఒక్కరికీ గట్టిగా మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎవరినీ గట్టిగా నిలదీయలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేశారని వైఎస్ జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు.

చిత్రం... హైదరాబాద్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వైకాపా అధినేత జగన్