రాష్ట్రీయం

మెట్రో రైలు కాస్త లేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: హైదరాబాద్‌లో ఏ రోడ్డున వెళ్లినా అడుగడుగునా ట్రాఫిక్. నిత్యం నరకాన్ని ఎదుర్కొనే మహానగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలు కాస్త ఆలస్యంగా పరుగులు తీయనుంది. ప్రతిపాదనల స్థాయి నుంచే అనేక రకాల అడ్డంకులెదుర్కొంటున్న మెట్రోరైలు కనీసం స్వరాష్ట్రం, స్వపరిపాలనలోనైనా కాస్త ముందుగా అందుబాటులోకి వస్తుందని భావించిన జంటనగరవాసుల అంచనాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం మూడు కారిడార్లుగా 72 కిలోమీటర్ల పొడువునా కొనసాగుతున్న పనుల్లో కొన్ని కారిడార్లలో యాభై శాతం పనులు పూర్తి కాగా, సికందరాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న రెండో కారిడార్ పనులు మరీ వెనుకబడి ఉన్నాయి. ఇప్పటికే ఆశించిన స్థాయిలో పనులు కొనసాగుతున్న నాగోల్-శిల్పారామం కారిడార్‌లో నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, కనీసం సికిందరాబాద్ స్టేషన్ వరకైనా వచ్చే జూన్ 2వ తేదీన అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అధికారులు చేసిన ఏర్పాట్లు ముందుకు సాగటం లేదు. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకే గాక, మరో రెండు స్టేషన్ల ముందు వరకు కూడా స్టేషన్ల నిర్మాణం పూర్తికావటంతో పాటు స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఆటోమెటిక్ ఫెయిర్ కంట్రోల్ యంత్రాలను కూడా అమర్చి, ట్రయల్ రన్ నిర్వహించారు. అంతేగాక, ఈ స్టేషన్లలో కమర్షియల్ షాపుల ఏర్పాటుకు స్థలాల కేటాయింపును కూడా ఖరారు చేశారు. అయితే నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ఎనిమిది కిలోమీటర్లు, అలాగే కారిడార్ 1లోని మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్ కాలనీ, అమీర్‌పేట వరకున్న స్టేషన్లలో షాపింగ్ మాల్స్, ఎస్కలేటర్లు, ఆటోమెటిక్ ఫేర్ కంట్రోల్ యంత్రాలను ఏర్పాటు చేసే పనులు చురుకుగా సాగుతున్నాయి. కారిడార్ 3లోని నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు, కారిడార్-1లో మియాపూర్-సంజీవరెడ్డినగర్ వరకు తొమ్మిది కిలోమీటర్ల పొడువునా మెట్రో ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని గత సంవత్సరం ఆగస్టు మాసంలో అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే! కానీ ఈ రెండు కారిడార్లలో భాగంగా కారిడార్ 1లోని మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్ వరకు అందుబాటులోకి తేవాలని భావించినా, అయిదు స్టేషన్లలో మరో యాభై శాతం పనులు మిగిలి ఉండటం, జూన్ 2 కల్లా పూర్తయ్యే అవకాశాల్లేకపోవటంతో మెట్రోరైలు ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. అన్ని రకాలుగా పూర్తయిన ఈ రెండు కారిడార్లలో ఎనిమిది, తొమ్మిది కిలోమీటర్ల వరకు మెట్రోరైలును అందుబాటులోకి తెస్తే తమకు కొంత సౌకర్యంగా ఉంటుందని ఆయా ప్రాంతాల ప్రజలు భావించారు. ముఖ్యంగా ఉప్పల్, నాగోల్, మెట్టుగూడ, చిలుకలగూడ, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రయాణికుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం అందుబాటులోకి తేవాలని భావిస్తున్న మియాపూర్-సంజీవరెడ్డి, నాగోల్-మెట్టుగూడ రూట్లలో కనీసం వచ్చే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వరకు కాకపోయినా, 2017 జనవరి 26వ తేదీ వరకు గానీ, వచ్చే సంవత్సరం ఉగాది పర్వదినానికైనా గానీ మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

వెబ్‌సైట్‌లో ఎస్‌ఐ
పరీక్ష ఆన్సర్ షీట్లు
మే 5వరకు లభ్యం
రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్
పూర్ణచంద్రరావు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్‌ఐ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులయిన అభ్యర్థుల జవాబు పత్రాలు వెబ్‌సైట్‌తీతీతీ.ఆఒఔఇ.జశలో లభ్యమవుతాయని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. అభ్యర్థుల జవాబు పత్రాల్లో వాల్యుయేషన్ పరంగా ఏమైనా పొరపాట్లు జరిగినట్టు భావిస్తే రూ. 5,000లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ. 2,000లు చెల్లించి తమ జవాబు పత్రాలను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశం మే ఐదవ తేదీ వరకు ఉంటుందని, ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. జవాబు పత్రాల కోసం అభ్యర్థులు చెల్లించే రుసుమును తిరిగి ఇవ్వడం కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చైర్మన్ పూర్ణాచంద్రరావు వివరించారు.
ఐరాసలో అధికార భాషగా
హిందీకి గుర్తింపు సాధించాలి
భారత రాయబారికి యార్లగడ్డ విజ్ఞప్తి
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఐక్యరాజ్య సమితిలో హిం దీకి అధికార భాషగా గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి తన్మయలాల్‌కు విజప్తి చేశారు. లక్ష్మీప్రసాద్ ఆదివారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో తన్మయలాల్‌ను కలిసి ఐక్యరాజ్యసమితి అధికార భాషల జాబితాలో హిందీని చేర్చటం గురించి చర్చించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ స్పానిష్ భాషలు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి. హిందీ, బెంగాలీ, పోర్చుగీస్, తుర్కిష్ భాషలకు కూడా అధికార భాషల గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఉన్నది.
జెఎన్‌టియు రెక్టార్‌గా
ప్రొఫెసర్ రమణారావు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 30: జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా, సుదీర్ఘకాలం ఎమ్సెట్ కన్వీనర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ఎన్ వి రమణారావును యూనివర్శిటీ రెక్టార్‌గా నియమించారు. 2016 తెలంగాణ రాష్ట్ర ఎమ్సెట్ కన్వీనర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రమణారావు చాలా కాలం పాటు కో కన్వీనర్‌గానూ, ఐదు ఎమ్సెట్‌లకు కన్వీనర్‌గానూ వ్యవహరించారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ పాలనా వ్యవహారాల్లోనూ, ఎమ్సెట్ నిర్వహణలోనూ అనేక మార్పులు చేపట్టారు. విద్యార్థులకు అనుకూలమైన చర్యలను చేపట్టి ఎమ్సెట్ నిర్వహణలో దేశంలోనే మార్గదర్శకంగా రూపొందించారు.

ఎంబిబిఎస్ సీట్ల భర్తీకి
13న ప్రవేశ పరీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 30: రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని యాజమాన్య బి కేటగిరి సీట్ల భర్తీకోసం మే నెల 13వ తేదీ ప్రవేశపరీక్ష జరుగనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 13వ తేదీ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష జరగనున్నదని ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్య సంఘం నిర్వహించే ఈ పరీక్షకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కొడాలి జయ రమేష్ తెలిపారు. రాష్ట్రంలో 13 మెడికల్ కళాశాలలు ఉండగా 576 సీట్లు, 12 దంత వైద్య కళాశాలలు ఉండగా 402 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం విజయవాడ, అనంతపురం, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కోల్‌కత్తా, కర్నూలు, ముంబయి, నెల్లూరు, న్యూఢిల్లీ, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దరఖాస్తు గడువును మే ఐదో తేదీ వరకు పొడిగించడమైంది.