రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండురోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ వైకె రెడ్డి సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ వాతావరణలో వచ్చిన స్వల్పమార్పుల వల్ల చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వివరించారు. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు గ్రామంలో మూడు సెంటీమీటర్లు, అచ్చంపేటలో రెండు సెంటీమీటర్లు, గట్టు గ్రామంలో ఒక సెంటీమీటర్, ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని వైకె రెడ్డి తెలిపారు. కోస్తాలోని విజయనగరం జిల్లా మేరకాముడిడ్యాం వద్ద ఒక సెంటమీటర్ వర్షపాతం నమోదైంది. అలాగే రాయలసీమలోని కర్నూలు జిల్లా పీపల్లిలో మూడు సెంటీమీటర్లు, అనంతపురం జిల్లా గూటి, మడకశిరలలో ఒక్కో సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని వైకెరెడ్డి తెలిపారు. ఇలా ఉండగా వచ్చే రెండురోజుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని డైరెక్టర్ తెలిపారు. కోస్తా జిల్లాలైన తూర్పుగోదావరి, గుంటూరులలో వడగాడ్పులు వీస్తాయన్నారు. గడచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. రామగుండం, జంగమేశ్వరపురంలలో 45 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.