రాష్ట్రీయం

చీమలు కుట్టి పసికందు మృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ,మే 2: విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో సోమవారం మరో ఘోరం జరిగింది. డాక్టర్లు, సిబ్బం ది నిర్లక్ష్య కారణంగా నాలుగురోజుల ఓ పసికందు తీవ్రం గా చీములు కుట్టి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై వామపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. పరామర్శించేందుకు వచ్చిన శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌ను ఘెరావ్ చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించకుండా పరామర్శకు వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసికందు మృతికి రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెనుమాకలో ఉంటున్న లక్ష్మి అనే మహిళకు నాలుగు రోజుల క్రితం మగబిడ్డ పుట్టడంతో కుటుంబ సభ్యులంతా సంతోషించారు. సోమవారం వేకువ ఝామున నిద్రలేచి చూడగా శిశువు చాతి, వీపు భాగాల్లో చీమలు కుట్టి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు కనిపించింది. అప్పటికే శిశువు మరణించినట్లు గుర్తించారు. చీమలు కుట్టడం వల్లే పసికందు మరణించాడని స్పష్టం అవుతున్నా వైద్యులు మాత్రం తమ బాధ్యతల తప్పించుకునే ప్రయత్నం చేశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్య వల్లే పసికందు మరణించిందని బుకాయించారు.
తెల్లవారుఝామున ఐదున్నర వరకు కూడా బిడ్డ బతికే వున్నాడని, రక్తస్రావం అవుతోందని వైద్యులకు తెలిపినా పట్టించుకోలేదని బంధువులు గుండెలు బాదుకుంటున్నారు. శిశువు జన్మించిన రెండురోజుల వరకూ తమకు చూపించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే జన్మించిన వెంటనే బాలుడి తరపువాళ్లే తీసుకెళ్లారని, అందువల్ల ఈ మరణంతో తమకు సంబంధం లేదని వైద్యులు వాదిస్తున్నారు. వార్డులో మిగిలిన పిల్లలను చీమలు ఎందుకు కుట్టలేదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో వైద్యుల తీరుపై అక్కడకు చేరుకున్న ప్రజాసంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఇదే ఆస్పత్రిలో ఇంక్యుబిలేటర్లు లేక గతంలో 10 మంది పిల్లలు మరణించిన సంఘటనలు ఉన్నాయి. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకలు కరిచి ఒక శిశువు మరణించడం, కర్నూలులో కుక్కలు కరిచి పసికందు మరణించినప్పటికీ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని తాజా దుర్ఘటన ద్వారా తేటతెల్లవౌతోంది.

చిత్రం చీములు కుట్టి ప్రాణాలు కోల్పోయిన పసికందు