రాష్ట్రీయం

ఉద్యాన రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: రాష్ట్రంలో ఉద్యానవన రైతుల రుణాలను కూడా రద్దుచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల రుణమాఫీపై చర్చ జరిగింది. రాష్ట్రంలో రైతులకు మొదటి విడత రుణమాఫీని విజయవంతంగా పూర్తిచేశామని, రెండోవిడత రుణమాఫీకి 3,331 కోట్ల రూపాయలను విడుదల చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు విలేఖరుల సమావేశంలో చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యానవన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో 2,23,000 మంది ఉద్యానవన రైతులు ఉన్నారని ఇందులో 1,60,000 మందికి రైతులకు రుణ విముక్తి లభించనుందన్నారు. తొలివిడత రుణమాఫీ కింద 384.47 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అన్నివర్గాల రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే మూడేళ్లలో దశలవారీగా రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. రుణమాఫీ ప్రకటించినప్పటి నుంచి రుణం పూర్తిగా తీరేవరకూ ప్రభుత్వం 10శాతం వడ్డీ కూడా రైతుల తరపున చెల్లిస్తుందని చంద్రబాబు చెప్పారు.
కరవు నివారణకు చర్యలు
రాష్ట్రంలో కరవును శాశ్వతంగా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ వేసవిలో మంచినీటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 850 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పశుగ్రాసం కొరతను నివారించేందుకు 32కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు 41కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు రూ. 14.69 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను ఆర్థికంగా ఆదుకునేందుకు అడ్వాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసిస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అనే సంస్థను కొత్తగా నెలకొల్పినట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థ ఉన్నప్పటికీ మున్సిపాలిటీలకు కావాల్సిన రుణాలను తీసుకురావడానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. కొత్తగా నెలకొల్పిన ఈ సంస్థకు ఓ బోర్డు ఉంటుందని, ఇది ఆయా మున్సిపాలిటీలకు బయటి నుంచి రుణాన్ని తీసుకొచ్చి ఇస్తుందన్నారు. ఇలా వచ్చిన మొత్తంతో ఆయా మున్సిపాలిటీల్లో రోడ్లు, కాలువలు, మరుగుదొడ్లు నిర్మిస్తారని చెప్పారు. ఈ పనులన్నీ ఆ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతాయని ఆయన తెలిపారు.
నీట్‌పై సుప్రీంకోర్టుకు వెళతాం!
నీట్‌పై సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించినట్టు చంద్రబాబు వెల్లడించారు. నీట్ నుంచి మన రాష్ట్రాన్ని మినహాయించవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అది కొంతవరకూ మాత్రమే జరిగిందని ఆయనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2లక్షల 92వేల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షలు రాశారన్నారు. సుప్రీం ఆదేశాలతో విద్యార్థులు అయోమయంలో పడ్డారన్నారు. రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయడానికి నాలుగేళ్లలో 574 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని ఆయన వెల్లడించారు. పాఠశాల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఫిజికల్ లిటరసీ తప్పనిసరి చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని చంద్రబాబు చెప్పారు. పాఠశాలల్లో యోగ, కూచిపూడి, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసిని తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు.
ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి నిధులు
రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 850 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ మొత్తంతో భూసేకరణ పనులు చేపడుతుంది. ఆ తరువాత ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రాథమికంగా 200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు బాబు చెప్పారు. కడప ఎయిర్‌పోర్టులో రన్‌వేని విస్తరిస్తామని తెలిపారు. అలాగే చైనాకు చెందిన షెంజన్, మన రాష్ట్రంలోని జెఎన్‌టియు కలిసి ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వివరించారు.

చిత్రం విజయవాడలో సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం