రాష్ట్రీయం

తెలంగాణ ప్రాజెక్టులతో ఏపికి అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: ‘కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోంది. ఈ సమస్య రోజురోజుకూ జటిలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నదీ జలాల వివాదంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ తరువాత జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు ఈ వివరాలను విలేఖర్లకు తెలిపారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి జలాల పంపిణీపై బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అపెక్స్ కౌన్సిల్ దీనిపై చర్చించాలి. కృష్ణా నుంచి 66 టిఎంసిల నీరు మాత్రమే వస్తోంది. ఇది మంచినీటి అవసరాలకు కూడా సరిపోవడం లేదని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి నదుల ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారు. దీనివల్ల దిగువ ప్రాంతాలకు నీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, దిండి, కల్వకుర్తి, గోదావరి నదిపై జి 5, జి 9, జి 10ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని అన్నారు. దీనివల్ల 125 నుంచి 130 టిఎంసిల నీరు ఎగువ రాష్ట్రాలు వాడుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చంద్రబాబు చెప్పారు. నదీ జలాల వివాదంలోని వాస్తవాలను బోర్డు చైర్మన్ ముందు ఉంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నీరు రాకుండా పోతోందని, వెంటనే ఇరు రాష్ట్రాల ప్రతినిధులను కేంద్రం సమావేశపరచాలని చంద్రమాబు కోరారు. కొత్త ప్రాజెక్ట్‌లు కట్టేటప్పుడు కేంద్రంతో చర్చించాల్సిన అవసం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లను వెంటనే ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డుల్లో ఏ రాష్ట్రం ఎంతెంత నీటిని వినియోగించుకోవాలన్నది స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోపోవడం దురదృష్టకరమన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర క్యాబినెట్ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఒకవేళ కేంద్రం దీని గురించి పట్టించుకోపోతే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? అని విలేఖరులు ప్రశ్నించగా.. ప్రాజెక్ట్‌ల గురించి కోర్టులు కూడా పట్టించుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.