రాష్ట్రీయం

నీట్‌పై నేడు వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: దేశవ్యాప్తంగా వైద్య విద్య యుజిలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మంగళవారం వాదనలు వినిపించనున్నాయి. ఇదిలావుంటే, తెలంగాణ ఎమ్సెట్ మెడికల్ పరీక్ష సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం స్పష్టం చేశారు. తెలంగాణ తరఫున రాష్టప్రతి ఉత్తర్వులను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని, అయితే రాష్ట్రంలో ఎమ్సెట్ మెడికల్ భవితవ్యం మాత్రం సుప్రీం తీర్పునకు లోబడి ఉంటుందన్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇంకెవరికైనా అభ్యంతరాలుంటే వారూ ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్, కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా కేసులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ తరఫున సుబ్రమణియన్, కర్నాటకలోని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల తరఫున కెకె వేణుగోపాల్ తమ వాదనలు వినిపించనున్నారు. అలాగే ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు కూడా నీట్ అంశంపై సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ పిటీషన్లు అన్నింటినీ మంగళవారం జస్టిస్ ఎఆర్ దవే అధ్యక్షతన ఉన్న బెంచ్ విచారించనుంది.
రాష్టప్రతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్ర, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు 370-డి ప్రకారం తమకు ‘నీట్’ నిబంధనలు వర్తించవని వాదిస్తున్నాయి. సుప్రీం ఆదేశాలు అనేక సాంకేతిక కారణాల వల్ల ఈ రెండు రాష్ట్రాలకూ వర్తించవని రెండు రాష్ట్రాల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల్లోని అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాత రెండు రాష్ట్రాలు వేర్వేరుగా పిటీషన్లను దాఖలు చేశాయి. తొలి నుండి ‘నీట్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లో అమలుచేసి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినా ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు వర్తించదనేది న్యాయనిపుణుల వాదన. దీనికి కారణం ఈ మూడు రాష్ట్రాలకు రాజ్యాంగ నిబంధన 370(డి) కింద ప్రత్యేక అధికారాలు కల్పించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నిబంధన ప్రకారమే రాష్ట్రంలో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిబంధన వర్తించకుండా ఉండాలంటే రాష్టప్రతి ఆమోదం అవసరం. దీనికిముందు పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాతీయరాజ్, ప్రభుత్వ టీచర్ల మధ్య గత 15 ఏళ్లుగా ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలుకు పెద్ద అడ్డంకిగా ఉన్నది కూడా ఈ రాజ్యాంగ నిబంధనే. దీనివల్లనే ప్రభుత్వాలు అనేకమార్లు ఆర్డినెన్స్‌లు ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానాలు చేసినా ఉమ్మడి సర్వీసు రూల్స్ నేటికీ అమల్లోకి రాలేదు. ఈ నిబంధన ప్రకారమే ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌లోనూ జోనల్ విధానం అమలులో ఉంది. సుప్రీంకోర్టు మాత్రం తన ఆదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేయాలని పేర్కొన్నా తీర్పు పాఠంలోనే 2010 డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘నీట్’ నోటిఫికేషన్ యథాతథంగా అమలులో ఉంటుందని పేర్కొంది. 2010 డిసెంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయలేదు. మిగిలిన అన్ని రాష్ట్రాలూ ఆ నోటిఫికేషన్‌ను అమలుచేశాయి. 2011, 2012 సంవత్సరాల్లో నీట్ నోటిఫికేషన్ వచ్చినా, అందులో ఆంధ్రప్రదేశ్ చేరలేదు. అపుడు యథాతథంగా ఎమ్సెట్‌ను నిర్వహించారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఆనాడు దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు నీట్ ఆధీనంలోకే వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాలేదన్న అంశాన్ని న్యాయనిపుణులు గుర్తుచేస్తున్నారు.