రాష్ట్రీయం

15న ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: రాష్ట్రంలో వాయిదా వేసిన ఎమ్సెట్, టెట్ పరీక్షల తేదీలను సోమవారం ఖరారు చేశారు. మే 15న ఎమ్సెట్, 22న టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇకమీదట అన్ని ప్రవేశపరీక్షలను ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఎమ్సెట్ హాల్‌టిక్కెట్లు మే 12 నుండి జారీ చేస్తామని, పరీక్ష మే 15న జరుగుతుందని, ఫలితాలను మే 27న ప్రకటిస్తామన్నారు. జూన్‌లో కౌనె్సలింగ్ నిర్వహించి, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇంజనీరింగ్ పరీక్ష మే 15న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకూ జరుగుతుందని అన్నారు. ఇంజనీరింగ్‌కు 1,44,501 మంది, అగ్రికల్చర్‌కు 1,01,987 మంది దరఖాస్తు చేశారని, మరికొంత మంది ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు.
అలాగే టెట్‌ను మే 22న నిర్వహిస్తామని పేర్కొన్నారు. హాల్‌టిక్కెట్లు మే 13 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, టెట్ తొలి పేపర్ ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకూ, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ జరుగుతుందని, టెట్ ఫలితాలను జూన్ 1న ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యాసంవత్సరం నష్టపోకుండానే అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. తెలంగాణలో 391 కెజిబివిలు, 182 మోడల్ స్కూళ్లు, 35 ఎస్సీ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, 12 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 134 సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లు, 138 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, 21 బిసి వెల్ఫేర్ సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లు, 402 జూనియర్ కాలేజీలు, 78 డిగ్రీ కాలేజీలు, 54 పాలిటెక్నిక్‌లు ఉన్నాయని మంత్రి చెప్పారు.

చిత్రం ఎమ్సెట్, టెట్ పరీక్షల షెడ్యూలు ప్రకటిస్తున్న డిప్యూటీ సిఎం కడియం