రాష్ట్రీయం

ఫ్యన్’ ఆగిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని కష్టకాలం ఎదురైంది. కొనఊపిరితో ఉన్న ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడబోతున్నది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఇప్పటికే కారెక్కేయగా.. మిగిలి ఉన్న ఖమ్మం వైకాపా లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (పినపాక) కూడా బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. 2014లో లోక్‌సభకు, అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), మదన్‌లాల్ (వైరా), పాయం వెంకటేశ్వర్లు(పినపాక) గెలిస్తే, వీరిలో తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ ఇదివరకే గులాబీ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వైకాపా ఇంతకాలం చాలా ఆశలే పెట్టుకుని ఉంది. ఆయనతో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయించరని ఆ పార్టీ నేతలు నమ్ముతూ వచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పరామర్శ యాత్రలు, రైతుభరోసా యాత్రలు, పాదయాత్రలు నిర్వహించినప్పుడు పొంగులేటి ఆమెకు అండగా ఉంటూ జన సమీకరణ, ప్రచార ఏర్పాట్లు చూసుకునే వారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సోదరి షర్మిలతో కొంతమేరకు ప్రచార కార్యక్రమాలు చేయించారు. కానీ పాదయాత్ర వల్ల ఆమె ఎడమ మోకాలు కొంత అరిగిపోవడంతో ఆమె ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. షర్మిల పూర్తిగా కోలుకున్నా, మునుపటిలా ఆమె తెలంగాణలో పర్యటించే పరిస్థితి లేదు. ఇకపోతే తాజాగా ఎంపి పొంగులేటి, ఎమ్మెల్యే పాయం బుధవారం పార్టీలో చేరనుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం చోటు చేసుకున్నది. కనీసం ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే అయినా పార్టీకి ఉన్నట్లయితే ప్రజా సమస్యలపై చట్ట సభల్లో పార్టీ వాణి వినిపించేందుకు అవకాశం ఉండేదని, కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా ఏవైనా పనులు ఉంటే తమ ఎంపీ, ఎమ్మెల్యే వద్దకు వెళ్ళేందుకు అవకాశం ఉండేదన్న అభిప్రాయం వైకాపా నేతలు వ్యక్తం చేస్తున్నారు.
పొంగులేటి స్థానంలో తెలంగాణ పార్టీ విభాగానికి కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటించాల్సి ఉంటుంది. 2014లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, డజను మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ శాసనసభాపక్షంలో రెండింట మూడో వంతు మందికి పైగా టిఆర్‌ఎస్‌లో చేరినందున ఆ పార్టీ శాసనసభాపక్షంలోని చీలిక విభాగాన్ని విలీనంగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ సదారామ్ బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైకాపా నుంచి నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు (వంద శాతం) టిఆర్‌ఎస్‌లో చేరినందున, ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని కూడా విలీనంగా గుర్తించే అవకాశం ఉంది.

chitram పొంగులేటి శ్రీనివాసరెడ్డి