రాష్ట్రీయం

భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూ. 800 కోట్ల హడ్కో రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 2: విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రభుత్వం తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సుమారు 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూముల్లో 3,500 ఎకరాలు రైతులకు చెందినవి కాగా, మరో 1,500 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. తొలుత రాజధాని తరహాలో భూ సమీకరణ ద్వారా ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూములు సేకరించాలని భావించారు. అయితే రైతులు నిరాకరించడంతో ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించింది. రైతులు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మాణం ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గలేదు. ప్రైవేటు రంగంలో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని సాధ్యమైనంత తొందరలో చేపట్టే దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలకు సన్నద్ధమైంది. తాజాగా రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. తిరుపతి, గన్నవరం ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి వౌలిక సదుపాయాల కల్పనకు సన్నాహాలు చేస్తున్నారు. భూసేకరణ, వౌలిక సదుపాయాల కల్పనకు హడ్కో నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఎయిర్‌పోర్టులకు హడ్కో రూ.800 కోట్లు రుణంగా మంజూరు చేయనుంది. ఈ నిధుల్లో అగ్రభాగం భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. భూసేకరణ పూర్తయిన మరుక్షణంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు చేపట్టాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే మూడేళ్లలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నది ఆలోచన.