రాష్ట్రీయం

సెలవుపై సిఎస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు కూడా కాకముందే ఎస్‌పి టక్కర్ సెలవుపై వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిసింది. ఏ కారణం చూపి ఆయన సెలవుపై వెళ్తున్నా ప్రధాన అంశం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పొసగడం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి తీరుతో సిఎస్ సర్దుకుపోలేకపోతున్నారని ఆయన బ్యాచ్ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఐఎఎస్‌లు, ఐపిఎస్‌ల బదిలీల వ్యవహారంపై ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులను బదిలీ చేయాలని సిఎస్ సిఫార్సు చేయగా చంద్రబాబు వేచి చూసే ధోరణి అవలంబించడం, చాలాసార్లు అందుకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో టక్కర్ అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. చాలామంది సీనియర్ అధికారులు జూనియర్లుగా ఉన్నప్పటి నుండి తాను వారి పని తీరును గమనిస్తున్నానని, కనుక బాగా పనిచేసే వారికి మంచి పోస్టింగ్‌లు ఇవ్వాలనే సిఎస్ అభిప్రాయంతో కూడా చంద్రబాబు విభేదించినట్లు తెలిసింది. పరిపాలన సజావుగా సాగుతున్న చోట పరిస్థితులను డిస్టర్బ్ చేయవద్దని సిఎస్‌ను ముఖ్యమంత్రి వారించినట్టు సమాచారం. తొలుత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను సిఎస్‌గా నియమించాలని సిఎం భావించారు. టక్కర్ ఎంపికకు చంద్రబాబు మొదట్లో అంత సానుకూలత కనబరచలేదు. అయితే కొంతమంది వత్తిడితోనూ, సీనియర్ అధికారి కావడంతోనూ కాదనలేక టక్కర్‌కు పదోన్నతి కల్పించడం జరిగినా, అనేక విషయాల్లో సిఎస్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ సమీక్షలు, రాత్రి పొద్దుపోయే వరకూ కలెక్టర్ల సమావేశాలు, వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహించడమేగాక, అనుదినం వారితో మాట్లాడే ప్రయత్నంలో కలెక్టర్ల సమయం రోజుకు మూడు నాలుగు గంటల పాటు వృథా అవుతోందనే చర్చ బహిరంగంగా జరుగుతోంది. సిఎస్‌కు తెలియకుండానే చాలా కార్యక్రమాలను సిఎం కార్యాలయ అధికారులు చకచకా కానిచ్చేస్తున్నారని, అది కూడా సిఎంకు, సిఎస్‌కు మధ్య సంబంధాలను దెబ్బతీసిందని అంటున్నారు. ఐఎఎస్ అధికారుల బదిలీల్లో, పోస్టింగ్‌లలో టక్కర్ కొంత స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే అలాంటి ఆలోచనలు లేకుండానే సిఎం కార్యాలయం జాబితాలను పంపిస్తోందని, దాంతోనే టక్కర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. భారీగా ఐపిఎస్‌లను బదిలీ చేసిన చంద్రబాబు, ఒకటి రెండు రోజుల్లో ఐఎఎస్‌ల బదిలీలకు సైతం కసరత్తు ప్రారంభించారని, ఇదే ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడానికి కారణమైందని అంటున్నారు.