రాష్ట్రీయం

భయంతోనే వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 5: గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సుహృద్భావ వాతావరణంలో చర్చించుకుందామని ఆహ్వానిస్తే, ఎక్కడ వాస్తవాలు బహిర్గతం అవుతాయోననే భయంతో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ స్పందించడం లేదని తెలంగాణ భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. చర్చలకు ముఖం చాటేస్తూనే, తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రా సర్కారు గగ్గోలు పెడుతోందని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను పావుగా వాడుకోవద్దని చంద్రబాబు, జగన్‌లకు హితవు పలికారు. బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బీర్కూర్ మండలం నాచుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు కట్టుబడే తాము కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. గోదావరి జలాల్లో 954టిఎంసిల నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్నదని గుర్తు చేశారు. ఇప్పటికైనా టి.టిడిపి నేతలు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబు వైపున ఉంటారా? లేక ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలుస్తారో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రయత్నం చేయవద్దన్నారు. ఒకవేళ చంద్రబాబు మోచేతి నీళ్లే తాగుతామని భావిస్తే, టి.టిడిపి నేతలను తెలంగాణ ప్రజలు విజయవాడకు తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్రాకు దక్కాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా తాము వాడుకోబోమని, అదే సమయంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

chitram నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు