రాష్ట్రీయం

‘ఎండ’ మృతులకు 5 లక్షలు పరిహారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5 : తెలంగాణ రాష్ట్రంలో వడగాడ్పుల వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. వడగాడ్పులు, వడదెబ్బ వల్ల మరణించిన వారికి ప్రస్తుతం 50 వేల రూపాయలు ఆపద్బంధు పథకం కింద చెల్లిస్తున్నామని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ వెంకట్‌రామిరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. ఎండల కారణంగా మరణిస్తున్న వారు ఎక్కువగా కుటుంబంలో కీలకమైన వారు, కుటుంబాన్ని పోషిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారం పెంచాలని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఎండాకాలం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 234 మంది వడగాడ్పులకు, వడదెబ్బకు మరణించారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 76 మంది మరణించారు. జిల్లాలవారీగా మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్-40 మంది, మెదక్-31, ఖమ్మం-24, ఆదిలాబాద్-20, కరీంనగర్-17, రంగారెడ్డి-14, నిజామాబాద్-11, వరంగల్-1 మంది ఉన్నారు.